FUNKY Telugu Film: 'జాతి రత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్... నాగ్ అశ్విన్ క్లాప్‌తో మొదలైన మూవీ, షూటింగ్ ఎప్పుడంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, జాతి రత్నాలు దర్శకుడితో తన నెక్స్ట్ మూవీ 'ఫంకీ' సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటున్న విశ్వక్ సేన్... 'జాతి రత్నాలు' దర్శకుడు కెవి అనుదీప్ (KV Anudeep)తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యిందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
విశ్వక్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో 'ఫంకీ'
విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఫంకీ' (Funky Movie). ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో 'ఫంకీ' సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమాలో నటిస్తున్న నటీనటులు, టెక్నికల్ టీం ఈ పూజా కార్యక్రమాలకు హాజరు కాగా, సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, కెమెరా స్విచ్ ఆన్ చేశారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. నిర్మాత నాగ వంశీ చిత్ర బృందానికి స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఆ పోస్టర్లో ప్రేమ గుర్తులతో పాటు 'ఫంకీ' అనే టైటిల్ డిజైన్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే పోస్టర్ మీద ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని రాసి ఉండడంతో పాటు, ఈ మూవీ యూత్ ఫుల్ అండ్ ఓ మంచి కుటుంబ కథ చిత్రంగా రూపొందుతోందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాత మూవీ పూజా కార్యక్రమాల సందర్భంగా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు అనుదీప్ శైలి ప్రత్యేకంగా ఉంటుందన్న సంగతి చెప్పక్కర్లేదు. మరోవైపు విశ్వక్ సేన్ ఎలాంటి పాత్రలోనైనా వదిగిపోతారు. అలాంటి అనుదీప్, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో సినిమా అంటే మంచి అంచనాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోందని చెప్పుకొచ్చారు. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సినిమా రావడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమాకు మ్యాడ్, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలకు సంగీతం అందించిన సంచలన సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 2025 సంక్రాంతి తర్వాత 'ఫంకీ' మూవీ షూటింగ్ షురూ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించబోతున్నారు.
'జాతిరత్నాలు' సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్. ఆ తర్వాత 'ప్రిన్స్' అనే మూవీ చేశాడు. తమిళ హీరో శివకార్తికేయన్ తో అనుదీప్ చేసిన ఈ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. దీంతో అనుదీప్ మరో మూవీ చేయడానికి చాలా టైమ్ పట్టింది. మధ్యలో 'మ్యాడ్', 'కల్కి' సినిమాలలో అతిథి పాత్రల్లో కూడా మెరిశాడు. మొత్తానికి దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన విశ్వక్ సేన్ హీరోగా తన కొత్త మూవీ 'ఫంకీ'ని మొదలు పెట్టడం విశేషం.
Also Read: కేతికా శర్మకు తెలుగులో మరో సినిమా... ఆవిడతో పాటు 'లవ్ టుడే' ఇవానా కూడా - హీరో ఎవరంటే?