అన్వేషించండి

Ramoji Film City: రామోజీ రావు కలల నిర్మాణం రామోజీ ఫిల్మ్ సిటీ - ఈ ఫాంటసీ ప్రపంచంలో ఎన్నో వింతలు!

మొఘల్ ప్యాలెస్‌ల నుంచి జపనీస్ గార్డెన్‌ల వరకు, ఎడారి నుంచి మంచు కొండల వరకు ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ రావు కలల ప్రపంచం ఈ చిత్రపురి నగరి.

Ramoji Rao Founder of the worlds largest  Ramoji Film City: అక్షర యోధుడు రామోజీ రావు అస్తమించారు. ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నఆయన ఇవాళ (జూన్ 8) తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయిని అధిరోహించారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో అద్భుత చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన, సినిమా షూటింగుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులు ఒకేచోట ఉండాలని భావించారు. అనుకున్నట్లుగానే ఆయన కలలుగన్న ఫాంటసీ ప్రపంచం రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ఈ ఫిల్మ్ సిటీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియో

హైదరాబాద్ నడిబొడ్డు నుంచి దాదాపు 35 కి.మీ దూరంలో ఉన్నది రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియోగా గుర్తింపు తెచ్చుకుంది RFC. హైదరాబాద్ శివారు ప్రాంతంలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని 2 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ స్టూడియో నిర్మాణానికి ఏకంగా 6 సంవత్సరాలు పట్టింది. హాలీవుడ్‌లోని యూనివర్సల్ స్టూడియోస్‌కు దీటుగా ఈ స్టూడియోను నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియో మాత్రమే కాకుండా.. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా, పలు ప్రత్యేక ఈవెంట్‌లకు వేదికగా, వినోద కేంద్రంగా విరాజిల్లుతోంది.

ఏడాదికి 400 సినిమాల నిర్మాణం

రామోజీ ఫిల్మ్ సిటీలో ఏడాదికి 400 సినిమాలకు పైగా షూటింగులు జరుపుకుంటున్నాయి. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడుతున్నాయి. ఒకే రోజులో ఏకకాలంలో 15 షూట్లు నిర్వహించే సత్తా RFCకి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిల్మ్ మేకర్స్ కు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ గా కొనసాగుతోంది. షూటింగ్, ఫిల్మ్ మేకింగ్ పరికరాలు మొదలుకొని విస్తృతమైన సెట్, పచ్చని ప్రకృతి దృశ్యాలు, అడవులు, సెట్టింగ్ వేదికలు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లాంటి సెట్లతో పాటు సులభంగా అందుబాటులో ఉండే టెక్నాలజీ, వాటిని ఉపయోగించే టెక్నికల్ మ్యాన్ పవర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.

ఫిల్మ్ మేకర్ కేవలం స్క్రిప్ట్, నటీనటులతో ఇక్కడికి వస్తే చాలు.. సినిమాను పూర్తి చేసుకుని బయటకు వెళ్లే అన్ని వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్, వసతి, రెస్టారెంట్లు, లాజిస్టిక్స్ అన్నీ ఉంటాయి. వినోద ప్రాంతంగానూ కొనసాగుతోంది. ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఎన్నో ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ సినిమాలోని పెద్ద పెద్ద భవంతుల సెట్టింగ్స్ అన్నీ ఇందులోనే ఏర్పాటు చేశారు. కాలకేయ సైన్యంతో యుద్ధం లాంటి అతిపెద్ద యాక్షన్ సన్నివేశాలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూట్ చేశారు. ఇప్పటికీ ‘బాహుబలి’ సినిమా సెట్టింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే ఉన్నాయి. ఇక్కడ సినిమాలు తీయడం వల్ల మిగతా స్టూడియోలతో పోల్చేతే తక్కువ ఖర్చుతో పూర్తవుతుందంటారు మేకర్స్.

ప్రముఖ పర్యాటక కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీని చూడ్డానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకుల RFCని సందర్శిస్తున్నారు. ఫిల్మ్ సిటీలో కాలిడోస్కోప్‌, రోలింగ్ ల్యాండ్‌స్కేప్‌లు, అద్భుతమైన గార్డెన్‌లు, ఆకర్షణీయమైన లైవ్ స్టంట్ షోలు, థ్రిల్ రైడ్‌లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. ఇక్కడి అద్భుతమైన సెట్‌లు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. మొఘల్, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రాజభవనాల నుంచి అమెరికన్ వైల్డ్ వెస్ట్‌ లోని పట్టణాల వరకు అద్భుతమైన సెట్టింగ్స్ ఇందులో ఉన్నాయి. బోరాసుర, మాంత్రికుల గుహ, హవా మహల్, భయపెట్టే గుహలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. రామోజీ టవర్ ఫిల్మ్ సిటీకే ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఫిల్మ్ సిటీకి సంబంధించిన ఏరియల్ వ్యూను అందిస్తుంది. 4D వర్చువల్ రియాలిటీని పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన రామోజీరావు కన్నుమూయడం నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరనిలోటు.   

Read Also: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ to ‘నువ్వే కావాలి’.. రామోజీ నిర్మించిన ఒక్కో మూవీ ఒక్కో ఆణిముత్యం - చివరి చిత్రం అదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Virat Kohli: అనుష్క!  నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Sonarika Bhadoria : దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి  సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Embed widget