అన్వేషించండి

NTR: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం

NTR Autograph At Polling Booth: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రోజు ఉదయం తెలంగాణలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే... పోలింగ్ స్టేషన్ వద్ద అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.

ఆటోగ్రాఫ్... ఒక్క ఆటోగ్రాఫ్... ఫేవరేట్ హీరో నుంచి జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, ఒక్కసారైనా తన అభిమాన కథానాయకుడిని నేరుగా చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో! అందుకోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సినిమా ఈవెంట్స్ & ప్రెస్ మీట్స్ దగ్గరకు వెళతారు. ఇంకొందరు ఇంకో అడుగు ముందుకు వేసి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని మరీ ఆ లొకేషన్ దగ్గరకు వెళతారు. కానీ, ఓ ఎన్టీఆర్ అభిమాని వెరైటీగా ఆలోచించాడు. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం ఆయనకు అలవాటు. ఆయన ఏ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేస్తారనేది చెప్పడం కష్టం ఏమీ కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడ ఓటు వేశారో చూస్తే... పోలింగ్ బూత్ వివరాలు తెలుస్తాయి. ఓ అభిమాని ఈ రోజు ఉదయం పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నాడు. ఎన్టీఆర్ ఓటు వేసి వచ్చిన అనంతరం... ''అన్నా! ఆటోగ్రాఫ్'' అంటూ ఆయన వద్దకు వెళ్లాడు.

అభిమాని గుండెలపై ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చేశారు. గుండెలపై అంటే గుండెలపై కాదు... షర్ట్ మీద హార్ట్ ఉండే ప్లేసులో సంతకం చేశారు యంగ్ టైగర్. ఆ అభిమానికి ఈ సంతకం ఎప్పటికీ గుర్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా?!

Also Read: టైమ్ చూసి జగన్ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్ - మాస్ రివేంజ్ షురూ!?

ఓటు హక్కు కోసం ముంబై నుంచి వచ్చిన ఎన్టీఆర్!
ఆదివారం రాత్రి వరకు ఎన్టీఆర్ ముంబైలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన హిందీ సినిమా 'వార్ 2' చిత్రీకరణ చేస్తున్నారు. హృతిక్ రోషన్, ఆయన హీరోలుగా 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) ఫ్రాంచైజీ లోనిది. ఒక వైపు షూటింగ్ బిజీ ఉన్నప్పటికీ... ఓటు హక్కు కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చారు. తన వంతు బాధ్యత నిర్వర్తించారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

దసరాకు 'దేవర' సందడి షురూ!
Devara Part 1 Release Date: 'వార్ 2' కంటే ముందు 'దేవర'తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. తనకు 'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయం అందించిన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాకపోవడంతో థియేటర్లలో తమ అభిమాన హీరోని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS DC Toss Update:   స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS DC Toss Update:   స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
SRH vs DC Head to Head Records: ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం, విశాఖ పిచ్ పరిస్థితి ఏంటి? ఎవరికి అనుకూలం
ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం, విశాఖ పిచ్ పరిస్థితి ఏంటి? ఎవరికి అనుకూలం
Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
PM Modi: దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Embed widget