News
News
వీడియోలు ఆటలు
X

Arjun Rampal In NBK 108 : బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్

Arjun Rampal as antagonist In NBK 108 Movie : నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నట్లు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది.

FOLLOW US: 
Share:

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా (NBK 108 Movie) తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) నటిస్తున్నారు. ఈ రోజు చిత్ర బృందం ఆ విషయాన్ని వెల్లడించింది.

బాలయ్యకు విలన్... అర్జున్ రాంపాల్!
బాలకృష్ణ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు ''జాతీయ పురస్కార గ్రహీత, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్ గారికి వెల్కమ్! తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది'' అని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమా పేర్కొంది. ఆల్రెడీ ఆయన షూటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. 

బాలయ్య డైలాగ్ అర్జున్ రాంపాల్ చెబితే?
'ఫ్లూట్ జింక ముందు ఊదు! సింహం ముందు కాదు' - నట సింహం చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్! ఇప్పుడు దీనిని అర్జున్ రాంపాల్ చెప్పారు. అంతే కాదు, అనిల్ రావిపూడి సినిమాలో మంచి మంచి డైలాగులు ఉన్నాయని ఆయన వివరించారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు థాంక్స్ అంటూ నమస్కారం పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ మీద సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. 

Also Read 'కస్టడీ'లో ఆ బూతుకు కత్తెర - సెన్సార్ రిపోర్ట్, రివ్యూ ఎలా ఉందంటే?

రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.

Also Read : రాజమౌళి 'మహాభారతం', చదవడానికి ఏడాది - పది భాగాలుగా!

బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు!
Sreeleela Balakrishna Relation In NBK 108 : ఎన్.బి.కె 108లో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె బాలకృష్ణ కుమార్తె పాత్ర చేస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీలీలకు బాబాయ్ పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. మరి, శ్రీలీల తండ్రి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అంటే... శరత్ కుమార్! ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో ఆయన నటిస్తున్నారు.

దసరా బరిలో బాలకృష్ణ సినిమా!
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మీ కళ్యాణం'తో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది. 

Published at : 10 May 2023 10:01 AM (IST) Tags: Nandamuri Balakrishna Anil Ravipudi NBK 108 Update Arjun Rampal Sreeleela Kajal Aggarwal Arjun Rampal Telugu Debut

సంబంధిత కథనాలు

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

టాప్ స్టోరీస్

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!