Naga Chaitanya: నాగ చైతన్యతో 'తెనాలి రామకృష్ణ'... 'తండేల్' సక్సెస్ మీట్‌లో కన్ఫర్మ్ చేసిన దర్శకుడు
Tenali Ramakrishna with Naga Chaitanya: తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'తెనాలి రామకృష్ణ'కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏఎన్ఆర్ మనవడు నాగ చైతన్యతో ఆ సినిమా చేయనున్నట్లు దర్శకుడు కన్ఫర్మ్ చేశారు.

భారతీయ చరిత్రను వెండి తెరపైకి తీసుకు వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు చిత్ర సీమలో అటువంటి సినిమాలలో 'తెనాలి రామకృష్ణ' (Tenali Ramakrishna) ఒకటి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు టైటిల్ రోల్ చేసిన ఆ సినిమాకు తెలుగు సినిమా చరిత్రతో పాటు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాను ఏఎన్నార్ మనవడు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)తో చేయనున్నట్లు దర్శకుడు స్పష్టం చేశారు.
చైతు చందూ మొండేటి కలయికలో డబుల్ హ్యాట్రిక్!?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దర్శకులలో అక్కినేని కుటుంబానికి డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరు? ఈతరం దర్శకులలో వీరాభిమాని ఎవరు? అని చూస్తే... చందూ మొండేటి పేరు ముందు వరుసలో తప్పకుండా వినపడుతుంది.
నాగ చైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి ఇప్పటి వరకు 3 సినిమాలు తీశారు. అందులో మొదటిది 'ప్రేమమ్'. మలయాళ సూపర్ హిట్ రీమేక్ అయినప్పటికీ... తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీసి ప్రశంసలు అందుకున్నారు చందూ మొండేటి అండ్ నాగ చైతన్య. తర్వాత చేసిన 'సవ్యసాచి' ఆశించిన ప్రశంసలు బాక్సాఫీస్ వసూళ్లు అందుకోలేదు. కానీ 'తండేల్'తో భారీ బాక్సాఫీస్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ సాధించడం మాత్రమే కాదు... 100 కోట్ల వసూళ్ల క్లబ్బులో ఈ సినిమా చేరబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో 'తెనాలి రామకృష్ణ' గురించి చెప్పారు చందూ మొండేటి. నాగ చైతన్యతో ఆయన డబుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడుతున్నారు అన్నమాట.
'తండేల్' విజయోత్సవ సభకు నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ సైతం హాజరు అయ్యారు. ఆవిడ గురించి చందూ మొండేటి మాట్లాడుతూ... ''శోభిత గారు చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు. అది నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ తెలుగులో మా హీరోకి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నా. ఎందుకు అంటే... భవిష్యత్తులో నాగచైతన్యతో గొప్ప హిస్టారికల్ సినిమా 'తెనాలి రామకృష్ణ' చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన ఆ సినిమా కథను మళ్లీ అత్యద్భుతంగా రాసి ఈ తరం ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకు రావాలో అలా తీసుకు వస్తాం అని చెప్పారు. నాగేశ్వరరావు గారు చేసినంత అభినయం మళ్లీ నాగ చైతన్య చేస్తారు'' అని చెప్పారు.
Also Read: బాలీవుడ్ దర్శకుడితో రామ్ చరణ్ భారీ మైథలాజికల్ ఫిల్మ్... సుక్కుతో సినిమా కంటే ముందు?
నాగ చైతన్య కూడా కన్ఫర్మ్ చేశారు!
'తెనాలి రామకృష్ణ' సినిమా చేయబోతున్నట్లు నాగచైతన్య కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. చందూ మొండేటి తనకు ప్రతి సారి కొత్త సవాల్ విసురుతాడని, ఆ సవాల్ ఎలా అధిగమించాలో కూడా అతడే చెబుతాడని నాగ చైతన్య తెలిపారు. 'తండేల్' పతాక సన్నివేశాలలో తన నటనకు అద్భుతమైన ప్రశంసలు రావడానికి కారణం చందూ మొండేటి ఇచ్చిన చిన్న చిన్న ఇన్‌పుట్స్ అని చెప్పారు. చందూ మొండేటితో తమ ప్రయాణం ఇదేవిధంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

