Ram Charan: బాలీవుడ్ దర్శకుడితో రామ్ చరణ్ భారీ మైథలాజికల్ ఫిల్మ్... సుక్కుతో సినిమా కంటే ముందు?
Ram Charan New Movie: సానా బుచ్చిబాబు సినిమా చిత్రీకరణలో రామ్ చరణ్ బిజీ. దీని తర్వాత సుక్కుతో సినిమా చేస్తారనే విషయం తెలిసిందే. మధ్యలో మరొక సినిమా వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పారా? ఈసారి బాలీవుడ్ దర్శకుడితో మైథలాజికల్ సినిమా చేయబోతున్నారా? అని ప్రశ్నిస్తే... అవును అంటున్నాయి ముంబై వర్గాలు. ఆ సినిమా కహాని ఏమిటి? దర్శకుడు ఎవరు? వంటి వివరాల్లోకి వెళితే....
యాక్షన్ సినిమాతో అప్రిసియేషన్...
ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమా!?
హిందీలో గత ఏడాది కిల్ అని ఒక సినిమా వచ్చింది. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ ప్రొడ్యూసర్. ఆ సినిమాలో లక్ష్య్ హీరో. అదే ఆయనకు తొలి సినిమా. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు సైతం 'కిల్'కు వచ్చాయి. ఆ చిత్రానికి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. అతనికి రామ్ చరణ్ హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చిందని ముంబై వర్గాలు చెబుతున్నాయి.
రామ్ చరణ్ హీరోగా నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో ప్రముఖ హిందీ నిర్మాత, రామ్ గోపాల్ వర్మ బంధువు మధు మంతెన మైథలాజికల్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. గత ఆరు నెలలుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
భారతీయ పురాణాలలో కీలక పాత్రలను తీసుకొని నిఖిల్ నగేష్ భట్ లార్జెర్ దాన్ లైఫ్ డ్రామా కథను రెడీ చేశారట. ఆల్రెడీ ప్రీ విజువలైజేషన్ కూడా కంప్లీట్ అయిందట. రామ్ చరణ్ ఎస్ చెప్పడమే ఆలస్యం అని వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారని సమాచారం.
బుచ్చిబాబు సానా సినిమా తర్వాత...
సుకుమార్ సినిమా కంటే ముందు సెట్స్ మీదకు!?
ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి 'పవర్ క్రికెట్' టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ సరసన నయా అతిలోకసుందరి జాన్వి కపూర్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావచ్చట.
నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో సినిమా కథ వినడానికి ముందే రామ్ చరణ్ మరో సినిమా ఓకే చేశారు. పుష్పతో పాన్ ఇండియా సక్సెస్ సాధించిన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా కంటే ముందు ఇప్పుడు నిఖిల్ నగేష్ భట్ సినిమా స్టార్ట్ కావచ్చని బాలీవుడ్ అంటోంది. మరి చరణ్ మనసులో ఏముందో? వెయిట్ అండ్ సి. ఇప్పుడు బుచ్చిబాబు సినిమా RC16 అయితే... నిఖిల్ నగేష్ భట్, సుకుమార్ సినిమాలు RC17, RC18 అవుతాయి.
Also Read: నా ఆటోగ్రాఫ్ రీ రిలీజ్... రవితేజ స్వీట్ మెమరీస్ థియేటర్లలోకి మళ్లీ వచ్చేది ఎప్పుడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

