Liger Movie OTT Rights : స్టార్‌తో విజయ్ దేవరకొండ డీల్ - 'లైగర్' ఓటీటీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'లైగర్' ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. ఏ ఓటీటీలో ఈ సినిమా వస్తుంది? శాటిలైట్ రైట్స్ ఏ ఓటీటీ దక్కించుకుంది? అనేది ఒకసారి చూస్తే...
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'లైగర్' (Liger Movie). ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది. ఇక్కడ విషయం అది కాదు! థియేటర్లలో సినిమాకు గొప్ప రెస్పాన్స్ ఏమీ రాలేదు. అందువల్ల, ఓటీటీలో సినిమా ఎప్పుడు వస్తుందని కొంత మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసమే ఇది!
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీకి 'లైగర్'
'లైగర్' సినిమా ఓటీటీ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Liger On Disney Plus Hotstar) సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ సహా అన్ని భారతీయ భాషల హక్కులు ఆ ఓటీటీవే. థియేటర్లలో ఈ రోజే సినిమా విడుదల అయ్యింది కాబట్టి... ఓటీటీలో ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు చెప్పడం కష్టమే. అయితే... విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... నాలుగు వారాల్లో రాయవచ్చని టాక్. థియేటర్లలో విడుదలైన ఎనిమిది నుంచి పది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఇటీవల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని కంటే ముందు ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
స్టార్ గోల్డ్ టీవీ ఛానల్‌లో...
డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే కాదు... శాటిలైట్ రైట్స్ కూడా స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. స్టార్ గోల్డ్, స్టార్ గ్రూప్‌కు చెందిన ఇతర ఛానళ్లలో 'లైగర్' సినిమా టెలికాస్ట్ కానుంది. అదీ సంగతి!
Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?
View this post on Instagram
థియేటర్లలో విడుదలైన మొదటి షో నుంచి 'లైగర్'కు ఫ్లాప్ టాక్ వచ్చింది. అటు అమెరికా, ఇటు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మందికి సినిమా నచ్చలేదు. ఇక... మీమర్స్, ట్రోల్స్ చేసే నెటిజన్లు అయితే ఒక రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. సినిమా మీద విమర్శలతో ఎటాక్ చేస్తున్నారు. సినిమా పరాజయానికి చాలా మంది దర్శకుడ్ పూరిని నిందిస్తున్నారు. ఆయన కథ, కథనాలపై సరిగా దృష్టి పెట్టలేదని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు సైతం సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. పాటల విషయంలో ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. డబ్బింగ్ సాంగ్స్ తరహాలో ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటించారు. హీరో తల్లి పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కనిపించారు. పతాక సన్నివేశాల్లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read : విజయ్ దేవరకొండ & 'లైగర్' టీమ్‌పై ట్రోలర్స్, మీమర్స్ ఎటాక్