అన్వేషించండి

Liger Movie Memes : విజయ్ దేవరకొండ & 'లైగర్' టీమ్‌పై ట్రోలర్స్, మీమర్స్ ఎటాక్

'లైగర్' సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది? విమర్శకులు ఏమంటున్నారు? అనేది పక్కన పెడితే... మీమర్స్ క్రియేటివిటీ చూపిస్తున్నారు. సినిమాపై ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

'లైగర్' (Liger Movie) విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో, అమెరికా నుంచి ఫ్లాప్‌ టాక్ వచ్చింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు సినిమా బాలేదని ముక్త కంఠంతో చెబుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం 'బ్లాక్ బస్టర్ లైగర్' (Blockbuster Liger), 'లైగర్ హంట్ బిగిన్స్' (Liger Hunt Begins)  హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. 

'లైగర్' గురించి ఎవరేం చెబుతున్నారు? అనేది పక్కన పెడితే... మీమ్ మేకర్స్, ట్రోలర్స్ మాత్రం ఎటాక్ స్టార్ట్ చేశారు. సినిమా అసలేం బాలేదని ఘంటాపథంగా చెబుతున్నారు. విమర్శల్లో క్రియేటివిటీ చూపిస్తూ విజయ్ దేవరకొండ అండ్ 'లైగర్' చిత్ర బృందం మీద ఎటాక్ స్టార్ట్ చేశారు.

'లైగర్'లో చాలా మంది పతాక సన్నివేశాలు నచ్చలేదు. ఇంకా క్లైమాక్స్ ఉందని అనుకుంటే... సడన్‌గా ఎండ్ కార్డ్స్ వేశారు. ఆ విషయం మీద మీమర్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. అదేం క్లైమాక్స్ అని క్వశ్చన్ చేస్తున్నారు. 'లైగర్'తో విజయ్ దేవరకొండకు పూరి జగన్నాథ్ పెద్ద దెబ్బ కొట్టారని కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మహేష్ బాబు పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని సూపర్ స్టార్, ఘట్టమనేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'లైగర్' కంటే ముందు మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ వర్క్ చేయాలని అనుకున్నారు. అయితే... అది 'లైగర్' సినిమా కాదు,  'జన గణ మణ'! అవును... 'జేజీఎం' (JGM Movie) సినిమాను ముందు మహేష్‌తో చేయాలనుకున్నారు పూరి. ఇప్పుడు ఆ సినిమా విజయ్ దేవరకొండ చేస్తుండటంతో తమ అభిమాన కథానాయకుడు ఒక ఘోర పరాజయం నుంచి తప్పించుకున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

'జన గణ మణ' ఆపేయ్ 
- విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ రిక్వెస్ట్!
'లైగర్' మీద మీమ్స్ పక్కన పెడితే... దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న, ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన 'జన గణ మణ' సినిమాను పక్కన పెట్టమని విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇండియా షేక్ అవ్వడం లేదుగా!
'లైగర్' విడుదలకు ముందు ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుందని విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ ఇచ్చారు. 'ఎక్కడ? షేక్ అవ్వడం లేదుగా' అని మీమర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. 'లైగర్' విడుదల రోజున ఇండియా తగలబడుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. 

పూరి రిటైర్ అవ్వాలా?
'లైగర్' సినిమా 'విక్రమ్'లో కమల్ హాసన్ యాక్షన్ రేంజ్‌లో ఉంటుందని అనుకుంటే... రజనీకాంత్ 'శివాజీ' సినిమాలో కమెడియన్ తరహాలో ఉందని చాలా మంది ట్వీట్లు చేశారు. మరికొంత మంది ఒక అడుగు ముందుకు వేసి... 'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ గురువు, కాంట్రవర్షియల్ కింగ్ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.  'ఇస్మార్ట్...' హిట్ కావడంతో ''పూరి జగన్నాథ్ ఇలాంటి సినిమాలు ఎలా తీస్తాడు? వెళ్లి కొడతా'' అని అప్పట్లో వర్మ అన్నారు. ఇప్పుడు ఇటువంటి సినిమా తీసినందుకు ఆయన్ను కొట్టాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?

'లైగర్'కు వెళ్లి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు
'డోంట్ వేస్ట్ యువర్ మనీ' (మీ డబ్బులు వృధా చేసుకోవద్దు) అని ఒక మీమర్ డైరెక్టుగా పోస్ట్ చేశారు. పబ్లిసిటీ పీక్స్‌లో ఉన్నప్పుడు... యూనిట్ అంతా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు 'లైగర్' గురించి అర్థం చేసుకోవాల్సిందని ఇంకొకరు కామెంట్ చేశారు.   

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget