ICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదలైంది. వన్డే ర్యాకింగ్స్ లో టాప్ 8లో ఉన్న ఎనిమిది జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఈ టోర్నీకి హోస్ట్ కంట్రీగా పాకిస్థాన్ నిలవగా....భద్రతా కారణాల రీత్యా భారత్ మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లోజరగనున్నాయి. మొదట పాకిస్థాన్ ఇందుకు ఒప్పుకోలేదు కానీ బీసీసీఐ పంతం..ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఎన్నికవటంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా మ్యాచ్ లు ఆడనున్నాయి. గ్రూప్ A లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తో పాటు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ బీలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తో పాటు చిచ్చరపిడుగు ఆఫ్గానిస్థాన్ ఉన్నాయి. ర్యాంకింగ్స్ లో పతనం కారణంగా శ్రీలంక, వెస్టిండీస్ లేకుండా ఈ సారి ఛాపియన్స్ ట్రోఫీ జరుగుతోంది.
2025 ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ కు పాకిస్థాన్ కు మధ్య కరాచీలో మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో దుబాయ్ లో ఆడుతుండగా...ఈ టోర్నీలో అత్యంత కీలకమైన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23 ఆదివారం జరగనుంది. చాలా గ్యాప్ తర్వాత న్యూజిలాండ్ తో మ్యాచ్ లో మార్చి 2 జరగనుంది. భారత్ ఫైనల్ కి వెళ్తే మాత్రం దుబాయ్ లోనే ఫైనల్ మ్యాచ్ జరగనుండగా...వెళ్లకుంటే మాత్రం లాహోర్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.