అన్వేషించండి

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 

Telangana CM Revanth Comments: మణిపూర్‌లో ఖనిజ సంపద కోసమే అంతర్యుద్ధం జరుగుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత సైన్యం తలచుకుంటే క్షణాల్లో కంట్రోల్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

Telangana News: దేశంలో చైనా ఆక్రమణ, మణిపూర్ అంతర్యద్ధంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మణిపూర్‌లో ఖనిజ సంపదపై కన్నేసిన కార్పొరేట్ శక్తులు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సాహిస్తున్నాయని అన్నారు. రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. 

2014 తరువాత దాదాపు 2వేల నుంచి 4వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రేవంత్ ఆరోపించారు. దీనిపై చర్చ చేసేందుకు కేంద్ర పాలకులకు ధైర్యం లేదని చర్చించే వాళ్లు అసలే లేరుంటా కామెంట్ చేశారు. అదే టైంలో మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు కారణం అక్కడ అధునాత ఆయుధాల సరఫరాయే అన్నారు. మణిపూర్‌లో ఖనిజ సంపద దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడితే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పలెవా?... తలచుకుంటే అక్కడి ఆయుధాలను సీజ్ చేయలేరా? అంటు ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న భయానక వాతావరణంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలన్నారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగి వాటిని నియంత్రించాలన్నారు. అప్పుడే దేశంలో శాంతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.  

యాదవరెడ్డి రాసిన పుస్తకాన్ని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... చాలా మంది సిద్ధాంతాలు చెబుతారు... కానీ పాటించే వారు మాత్రం కొద్దిమందే ఉంటారని అలాంటి వారిలో యాదవరెడ్డి ఒకరు అని తెలియజేశారు. నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు. సురవరం లాంటి వారు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే, జైపాల్ రెడ్డి, యాదవ రెడ్డి లాంటి వారు సాఫ్ట్ కోర్ కమ్యూనిస్టులని కొనియాడారు. 

దేశంలో పేదలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు ఈ ఇద్దరూ కాంగ్రెస్  పార్టీలో పని చేశారని గుర్తు చేశారు. పదవుల కోసం కాకుండా... సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ యాదవరెడ్డి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తెర వెనుక  కృషి చేసిన వారిలో ఆయన ఒకరన్నారు. సోనియాగాంధీ చర్చించిన సమయంలో ఆయన కూడా తెలంగాణ ఆవశ్యకత  వివరించారన్నారు. 

తెలంగాణ బిల్లును ఆమోదించించడంలో జైపాల్ రెడ్డితోపాటు యాదవ రెడ్డి తన బాధ్యత నిర్వహించారన్నారు రేవంత్. ముల్కీ- నాన్ ముల్కీ నుంచి, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు  సంపూర్ణ వివరాలతో పుస్తకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాలను వివరిస్తూ తెలంగాణ ఉద్యమం చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. 

ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారి గురించి కూడా ఆ పుస్తకంలో వివరించాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్. అలాంటి పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Embed widget