Allu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP Desam
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. పుష్ప ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి ఏం జరిగిందన్న విషయంపైనే పోలీసులు అల్లు అర్జున్ ను సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిక్కడల్లి సీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగా...ఏసీపీ, డీసీపీలు కూడా విచారణ బృందంలో ఉన్నారు. అల్లు అర్జున్ చెప్పే స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఇప్పటివరకూ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కు ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధించారు
1. పర్మిషన్
పోలీసులు సంధ్యా ధియేటర్ కు హీరో, హీరోయిన్ రాకూడదని పక్కాగా సమాచారం ఇచ్చినప్పుడు...సంధ్యా థియేటర్ నిర్వాహకులు అదే సమాచారాన్ని చిత్రబృందానికి అందించినప్పుడు...పర్మిషన్ లేదనే విషయం తెలిసి కూడా ఎందుకు థియేటర్ కు వచ్చారు అనే సూటి ప్రశ్నను పోలీసులు సంధించారు. పైగా రోడ్ షో ఎందుకు చేశారనే ప్రశ్న ఎదురైంది.
2. రేవతి మరణవార్త
రెండో ప్రశ్న రేవతి మరణవార్త గురించి అడిగారు పోలీసులు. మీకు రేవతి తొక్కిసలాటలో మృతి చెందిందన్న విషయం తెలుసా అని అడిగితే అల్లు అర్జున్ తెలుసు..కానీ తర్వాతి రోజు నాకు తెలిసింది అని చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది.
3. పోలీసులు సమాచారం ఇచ్చారా.?
రేవతి చనిపోయిందని...ఆమె బాబు చావు బతుకుల్లో ఉన్నాడని..మీరు వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ, డీసీపీ మీ వద్దకు చెప్పారా అనే ప్రశ్న అల్లు అర్జున్ ను అడిగారు పోలీసులు. దీనికి సమాధానంగా తన వద్దకు ఏ పోలీసులు రాలేదని...తనకేం చెప్పలేదని...మీడియాకు పోలీసులు తప్పుడు ఆరోపణలు చేశారంటూ తన ఆవేదనను బన్నీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.