Krishna Vrinda Vihari Movie Release Date: ఏప్రిల్‌లో నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి', విడుదల తేదీ ఖరారు
Naga Shourya and Shirley Setia's Krishna Vrinda Vihari Movie Release Date: నాగశౌర్య, షెర్లియా సేతి జంటగా నటిస్తున్న 'కృష్ణ వ్రింద విహారి' విడుదల తేదీ ఖరారు అయ్యింది.

కృష్ణ పాత్రలో యువ హీరో నాగశౌర్య (Naga Shourya) నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari). టైటిల్‌లో వ్రింద అని ఉంది కదా! అది సినిమాలో హీరోయిన్ పేరు. నాగశౌర్యకు జోడీగా, ఆ పాత్రలో షెర్లియా సేతి (Shirley Setia) నటించారు. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఏప్రిల్ 22 (Krishna Vrinda Vihari On April 22, 2022)న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది.
'కృష్ణ వ్రింద విహారి' చిత్రానికి అనీష్ ఆర్. కృష్ణ దర్శకుడు. గతంలో ఆయన 'అలా ఎలా?' వంటి ఎంటర్టైనర్ తీశారు. 'లవర్', 'గాలి సంపత్' సినిమాలకూ ఆయనే దర్శకుడు. ఐరా క్రియేషన్స్ సంస్థ సినిమాను తెరకెక్కించింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 'ఛలో', 'అశ్వథ్థామ' వంటి హిట్స్ ఉన్నాయి. 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Release Date) సినిమా పోస్టర్లు చూస్తుంటే మరో కలర్ ఫుల్ ఎంటర్టైనర్ వస్తున్నట్టు అనిపిస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

