అన్వేషించండి

Kollywood: తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?

Tamil Cinema: తమిళ తంబీలకు 1000 కోట్ల క్లబ్ అనేది తీరని కలేనా? టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ఉన్నా ఒక్క 1000 కోట్ల సినిమా లేదు. 'కంగువ' కూడా చేతులెత్తేసింది. మరి నెక్స్ట్ ఏ మూవీ వచ్చి కల తీరుస్తుంది?

Kollywood 1000 Crore Movies: ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు తమిళ సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరు. మణిరత్నం, కమల్ హాసన్, రజనీకాంత్, శంకర్, ఏఆర్ రెహమాన్... దేశం గర్వపడే కళాకారులను అందించింది. ఎన్నో గొప్ప సినిమాలు తీసిన చరిత్ర ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకు ఈజీ టార్గెట్ గా మారిపోయిన 1000 కోట్ల క్లబ్బును మాత్రం ఇంత వరకూ తమిళ్ ఇండస్ట్రీ అందుకోలేకపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా టచ్ చేసిన ఈ వెయ్యి కోట్ల క్లబ్ కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం అందని ద్రాక్ష అయిపోయింది.

1000 కోట్లు దాటేస్తామని చెప్పి చతికిలబడ్డ 'కంగువ'
ఇటీవల రిలీజైన 'కంగువ' ఖచ్చితంగా తమిళ్ ఇండస్ట్రీకి 1000 కోట్లు తెచ్చిపెట్టే తొలి సినిమా అవుతుందని అందరూ లెక్కలు వేశారు. తమిళ, తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో సూర్యకు ఉన్న ఫాలోయింగ్, ఆ సినిమా జోనర్ దృష్ట్యా వెయ్యి కోట్ల ఫీట్ సాధ్యమయ్యే అవకాశం ఉందని సినీ ప్రేమికులు భావించారు. అయితే అనుకున్న స్థాయి ఫలితం ఆ సినిమా సాధించలేకపోయింది. దానితో అసలు తమిళ ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు దాటే సినిమా ఇంకెప్పుడు వస్తుందని తమిళ ప్రేక్షకులు కొంత డీలా పడిన మాట వాస్తవం. ఇప్పటికీ శంకర్, రజనీకాంత్ ల కాంబోలో 2018లో వచ్చిన 'రోబో 2' సినిమాయే తమిళ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన అత్యధిక కలెక్షన్లు (660 - 800కోట్లు) సాధించిన సినిమాగా టాప్ ప్లేస్ లో ఉంది. అయితే ఆ సినిమా కంటే ఏడాది ముందే 2017 ఏప్రిల్ లో తెలుగులో రాజమౌళి తీసిన 'బాహుబలి - 2' సినిమా 1000 కోట్లు దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డ్ సృష్టించింది. దానికంటే ముందే రిలీజ్ అయిన అమీర్ ఖాన్ 'దంగల్' కూడా వెయ్యి కోట్లు దాటిన మూవీగా ఆ ఫీట్ సాధించింది. దాని సెకండ్ ఫేజ్ రిలీజ్‌లో అంటే జూలై 2017లో చైనా తైవాన్ లలో రిలీజ్ అయ్యాకే. ఇక అప్పటి నుంచి బాహుబలి రికార్డ్స్ టార్గెట్ చేస్తూ వివిధ భాషల్లో వచ్చిన సినిమాల్లో చాలా వరకూ డిజాస్టర్ అయ్యాయి. వాటిలో విజయ్ 'పులి', అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.

వెయ్యి కోట్లు దాటిన ఇండియన్ సినిమాలు ఎన్ని?
ప్రస్తుతానికి ఇండియన్ సినిమాల్లో 1000 కోట్లు దాటిన సినిమాలుగా 'బాహుబలి 2', 'దంగల్', 'కల్కి 2898 ఏడీ', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఆర్', 'జవాన్', 'పఠాన్' మాత్రమే ఉన్నాయి.  ఏడు సినిమాల్లో మూడు తెలుగు, మూడు హిందీ, ఒకటి కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినవే. అయితే విచిత్రంగా ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరైన తమిళ్ ఇండస్ట్రీ నుండి మాత్రం వరకు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన సినిమా రాకపోవడం తమిళ తంబీలకు కాస్త నిరాశ కలిగించే అని చెప్పాలి. 'పోనియన్ సెల్వన్'తో మణిరత్నం ఆ ఫీట్ సాధిస్తారని అంచనాలు వేసినా తను ఆ ఉద్దేశంతో ఆ సినిమా తీయలేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తిగా తమిళ నేపథ్యానికి చెందిన 'పొనియన్ సెల్వన్' తమిళంలో హిట్ అయినా మిగిలిన ప్రాంతాలను ఆకట్టుకోలేదు. లోకేష్ కనకరాజు తీసిన 'లియో', 'విక్రమ్'తో పాటు విజయ్ 'గోట్' సినిమాలు కూడా ఆ ఫీట్ సాధించలేకపోయాయి. 'తంగలాన్'పై మొదట్లో అంచనాలు ఉన్నా ఆ సినిమా తీసిన నేపథ్యం వేరు. ఇక తమిళ ఇండస్ట్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'కంగువ' పూర్తిగా చేతులెత్తేసింది. దానితో ప్రస్తుతానికి ఆ 1000 కోట్ల కల అసంపూర్తిగానే ఉండిపోయింది.

Also Read: ఇండియన్ సినిమాల్లో తొలి లిప్ లాక్ - ఆ హీరోయిన్ మన విశాఖ అమ్మాయే అని తెలుసా?

1000 కోట్ల క్లబ్బులో చేరకపోవడానికి కారణాలు ఇవేనా? 
1000 కోట్ల పైబడి వసూళ్లు సాధించాలంటే ఆ సినిమా అద్భుత రసాన్ని గాని, లేదా మానవ సంబంధ మూలాలను గాని  బలంగా చూపించగలిగి ఉండాలి. అంతే గాని భారీ బడ్జెట్ పెట్టేశారని అని ప్రేక్షకులు పరుగులు పెట్టి చూడరు. తెలుగులో వెయ్యి కోట్లు దాటిన 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్', 'కల్కి 2898 ఏడీ' వేరే వేరే జోనర్లలో వచ్చిన పిరియాడిక్ మూవీలు. వీటిలోని అద్భుత రసం, డైరెక్టర్ల కన్వెక్షన్ ఆ సినిమాలను ఓ రేంజ్ లో నిలిపాయి. 'దంగల్'లో బలమైన మానవ సంబంధాలను, ఎమోషన్‌లను చూపిస్తే... 'పఠాన్', 'జవాన్‌'లో దేశం మొత్తం కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఉండి దానికి స్టార్ వాల్యూ తోడైంది. ఇక కేజీఎఫ్ 2 అనేది అద్భుత, వీర రసాల కలయిక. తమిళ్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఆ విధమైన కన్విక్షన్ తేవడంలో ఎక్కడో ఫెయిల్ అవుతోంది. నిజానికి... హిందీ సినిమా 'జవాన్'తో 1000 కోట్లు కొట్టిన అట్లీ లాంటి డైరెక్టర్ తమిళనాడు నుంచి వచ్చాడు. ఏదో ఒక రోజు తమిళ సినిమాతో అట్లీ, శంకర్, లోకేష్ రాజ్,మణి రత్నం, నెల్సన్ లాంటి డైరెక్టర్లు ఆ 1000 కోట్ల మార్కును అందుకుంటారనే నమ్మకం చాలా మందిలో ఉంది. అయితే అది ఎప్పుడు అన్నదే తమిళ తంబిలను  వేధిస్తున్న ప్రశ్న.

Also Read1000 Crore Movies: బాహుబలిని బీట్ చేసేదెవరు? 1000 కోట్లు క్లబ్బు దాటి వెళ్ళేదెవరు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
Embed widget