Walking for Weight Loss : బరువు తగ్గడం కోసం ఏ వయసువారు ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలో తెలుసా? నిపుణుల సలహాలివే
Age Based Walking Durations : బరువు తగ్గేందుకు వాకింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ వయసు ప్రకారం ఎంతసేపు నడిస్తే బరువు తగ్గడానికి వీలు ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం.

Walk Daily Based on Your Age : జిమ్‌కి వెళ్లనివారికి.. రెగ్యులర్ పనుల్లో బిజీగా ఉండేవారికి, వ్యాయామం చేయడానికి వీలు లేనివారికి నడక ఓ ప్రభావవంతమైన వర్క్అవుట్ అని చెప్పవచ్చు. అలాగే జిమ్ చేసేవారు కూడా మరిన్ని ప్రయోజనాలకోసం వాకింగ్ చేయవచ్చు. వయసుతో సంబంధం లేకుండా.. ప్రదేశంతో సంబంధం లేకుండా దీనిని రోజూ చేయవచ్చు. అయితే బరువు తగ్గడానికి వాకింగ్ చేయాలనుకుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఫిట్‌నెస్‌లో భాగంగా, బరువు తగ్గేందుకు మీరు వాకింగ్ చేయాలనుకుంటున్నారా? రోజుకో గంట నడిచేయాలి అనుకోకండి. మీ వయసు ప్రకారం రోజుకు ఎంత నడిస్తే మంచి ఫలితాలుంటాయో తెలుసుకుని.. దానికి అనుగుణంగా మీరు వాకింగ్ చేయొచ్చు. వాకింగ్‌తో బరువు తగ్గాలనుకుంటే అది వయసును బట్టి.. వారు నడిచే వేగం, తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు. ఏ వయసువారు ఎన్ని నిమిషాలు వాక్ చేస్తే మంచిదో.. దానివల్ల బరువు ఎలా తగ్గుతారో.. ఇప్పుడు చూసేయండి.
40 ఏళ్లలోపు వారు..
యుక్తవయసు నుంచి 40 ఏళ్లలోపు వయసువారు వారానికి కనీసం ఐదు రోజులు 45 నుంచి 60 నిమిషాల పాటు నడవాలి సూచిస్తున్నారు. అది కూడా వేగంగా నడవాలని సూచిస్తున్నారు. ఈ వయసులో వేగం, తీవ్రత పెంచినా.. శరీరం సహకరిస్తుంది కాబట్టి రోజుకు 45 నుంచి గంట నడవాలి అంటున్నారు. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందట. అలాగే మెటబాలీజం పెరిగి.. కేలరీలు బర్న్ అవుతాయని చెప్తున్నారు.
మీరు నడిచే వేగాన్ని, తీవ్రతని బట్టి కేలరీలు బర్న్ అవుతాయి. దీనివల్ల కొవ్వు కరిగి.. బరువు తగ్గడంలో, శరీరానికి మంచి షేప్ అందడంలో హెల్ప్ అవుతుంది. అయితే మీరు ఈ గంట వ్యవధిని రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. ఉదయం సగం, సాయంత్రం సగం చేయవచ్చు. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ దీనిని కంటిన్యూ చేయవచ్చు.
40 ఏళ్లు దాటితే..
వయసుతోపాటు జీవక్రియ మందగిస్తుంది. 40-50 ఏళ్లలో మెటబాలీజం తగ్గుతుంది. కాబట్టి ఈ వయసువారు మితమైన వేగంతో వాకింగ్ చేయాలి. రోజుకు 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేస్తే సరిపోతుంది. వీటితో పాటు స్ట్రెంగ్త్ వర్క్అవుట్లు వంటివి కూడా చేస్తే బరువు తగ్గడంతో పాటు మరింత ఫిట్‌గా మారుతారు.
60 ఏళ్లు.. ఆపైన
వృద్ధాప్య దశలో బరువు తగ్గాలనుకుంటే.. శరీరం సహకరించడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ మీరు 20 నుంచి 30 నిమిషాలు వాక్ చేయొచ్చు. అధిక వ్యాయామాల జోలికి వెళ్లకూడదు. బాడీని యాక్టివ్‌గా ఉంచేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
బరువును కంట్రోల్ చేయడానికి నడక చాలా సురక్షితమైనది. పైగా దీనిని అందరూ ఎఫర్ట్ చేయగలరు. మీ వయసు ప్రకారం నియమించుకున్న సమయాన్ని రెండు భాగాలు చేసి.. బ్రేక్స్ తీసుకుంటూ ఎఫెక్టివ్‌గా బరువు తగ్గొచ్చు. వాటితో పాటు తేలికపాటి వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నించండి. వాకింగ్‌కి ముందు తర్వాత కచ్చితంగా వార్మప్, రిలాక్స్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి.
సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటూ, హైడ్రేటెడ్‌గా ఉంటూ.. నిద్ర విషయంలో రాజీపడకుండా ఉండే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బరువు కూడా తగ్గుతారు. అలాగే బరువు తగ్గడం శరీరతత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒకరికి తొందరగా రిజల్ట్స్ రావొచ్చు. మరికొందరికి చాలా టైమ్ పట్టొచ్చు. అందుకని నిరాశపడకుండా.. మీ గోల్‌ని రీచ్ అయ్యేందుకు రోజూ వాక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
Also Read : 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఇదే.. ఈ రొటీన్ ఫాలో అయితే బరువు తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

