Tips for Long Hair : జుట్టు పొడుగ్గా పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్‌తో లాంగ్ హెయిర్ మీ సొంతం
Long Hair : హెయిర్‌కి ఎంత కేర్ తీసుకున్నా రాలిపోతుందా? అయితే ఈ మార్పులు చేసి చూడండి జుట్టు రాలడం తగ్గడంతో పాటు పొడుగ్గా కూడా పెరుగుతుంది.

Tips to Growing Long and Healthy Hair : అమ్మాయిలకైనా.. అబ్బాయిలకైనా జుట్టు అనేది ఓ ఎమోషన్. పాపం కానీ కొందరు ఎన్ని ట్రై చేసినా.. జుట్టు రాలిపోతూనే ఉంటుంది. మరికొందరు జుట్టు పెంచుకోవాలన్నా గ్రోత్ ఉండదు. అలా జుట్టు రాలిపోకుండా.. పొడుగ్గా పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేస్తే.. వాలుజడ మీ సొంతమవుతుంది. వీలైనంత త్వరగా లాంగ్ హెయిర్ కావాలనుకునేవారు ఏ టిప్స్ ఫాలో అయితే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
ట్రిమ్ చేయండి..
జుట్టును పెంచుకోవాలనుకునేవారు చిన్నపాటి జుట్టును కట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఆరువారాలకు ఓసారి.. హెయిర్‌ని ట్రిమ్ చేయించండి. దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. జుట్టు పెరుగుదల బాగుంటుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉంటే జుట్టు పెరుగుదల ఆలస్యమవుతుంది. నిర్జీవమైన హెయిర్ కూడా హెయిర్ గ్రోత్‌ని ఆపేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా ట్రిమ్ చేయించండ వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
బ్లీచ్ మానేయండి..
జుట్టును స్టైలిష్‌గా మార్చుకునేందుకు చాలామంది బ్లీచ్ కలర్స్ వేయించుకుంటారు. ఇది జుట్టును స్టైల్‌గా చూపించినా.. కొన్ని రోజులకు గడ్డిగా మార్చేస్తుంది. హెల్తీ హెయిర్ పోయి.. పెరుగుదల తగ్గిపోతుంది. జుట్టు డ్యామేజ్ ఎక్కువై స్ప్లిట్ ఎండ్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి దానిని అవాయిడ్ చేయండి. బ్లీచ్ లేని కలర్స్ ట్రై చేయవచ్చు. కెమికల్స్ లేని హెయిర్ ట్రీట్మెంట్స్ మంచిది.
నిద్రకు ముందోసారి..
రాత్రుళ్లు నిద్రపోయేముందు తలను దువ్వుకోవాలి. నూనెతో మసాజ్ చేసుకుంటూ.. జుట్టును దువ్వుకుంటే తలలో రక్తప్రసరణ పెరిగి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.
దువ్వెన మంచిదైతే..
చాలామంది జుట్టు రాలుతుందని బాధపడతారు కానీ.. మంచి దువ్వెనను వాడడంపై దృష్టి పెట్టరు. పెద్ద బ్రిజల్స్తో వచ్చిన దువ్వెన లేదా చెక్క దువ్వెనను ఎంచుకోవచ్చు. అలాగే దువ్వెనను రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూ డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఇది కూడా జుట్టు పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది.
డైట్
జుట్టు పెరుగుదల బాగుండాలంటే హెల్తీ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్ కండరాల బలానికే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా చాలామంచిది. మీట్, చేపలు, బీన్స్, నట్స్ వంటివి జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి. పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవాలి. విటమిన్ ఏ, సి, ఈ.. జింక్, ఐరన్ వంటి పోషకాలు, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉండే ఫుడ్‌ని రెగ్యులర్‌గా తినాలి. ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్‌కి దూరంగా ఉండాలి.
ఆయిల్ & షాంపూ
జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే డ్రైగా కాకుండా హెల్తీగా ఉంటుంది. ఇది జుట్టు డ్యామేజ్ అయితే దానికి పోషణను అందిస్తుంది. అలాగే వారానికి రెండు లేదా మూడుసార్లు కచ్చితంగా తలస్నానం చేయాలి. అంతకన్నా ఎక్కువసార్లు తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.
కండీషనర్
తలస్నానం తర్వాత జుట్టు కండీషనర్‌ని కచ్చితంగా అప్లై చేయాలి. ఇది జుట్టును హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా హెల్తీగా ఉంచుతుంది. జుట్టు చిక్కుపడకుండా హెల్ప్ చేస్తుంది. హెయిర్ సీరస్ అప్లై చేయడం వల్ల కూడా జుట్టు పెరుగుదల బాగుంటుంది.
మరిన్ని జాగ్రత్తలు
వేడినీళ్లతో స్నానం చేస్తే జుట్టు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. డాండ్రఫ్ పెరుగుతుంది. కాబట్టి చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయవచ్చు. మసాజ్ చేయడం వల్ల కూడా జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. దీనివల్ల జుట్టు మధ్యలో చిట్లిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. తలస్నానానిక ముందు జుట్టు శుభ్రంగా దువ్వుకుంటే మంచిది. హీటింగ్ టూల్స్‌కి దూరంగా ఉండాలి. సిల్క్ పిల్లో కేస్ కూడా మంచి ఫలితాలను అందించడంలో హెల్ప్ చేస్తుంది.
Also Read : మగవారికి స్కిన్ కేర్ రొటీన్.. హెల్తీ, మెరిసే చర్మం కోసం ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ ట్రై చేయొచ్చు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

