ICC Champions Trophy: బుమ్రా లేకపోవడం పెద్ద లోటే.. అర్షదీప్ ను తీసుకున్నా.. దాని నుంచి అతను బయటపడాలి
ఈ టోర్నీలో దాదాపుగా ఇద్దరు కొత్త పేసర్లతోనే బరిలోకి దిగుతుందని చెప్పాలి.అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా లాంటి అనుభవం లేని పేసర్లపై ఆధార పడుతోంది. మహ్మద్ షమీ ఉన్నా, గాయాల బెడద, ఫామ్ లే లేడు.

Jasprit Bumrah News: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో గురువారం నుంచి ప్రారంభమవుతుంది. అయితే భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఈ టోర్నీలో భారత్ బరిలోకి దిగుతోంది. కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్న బుమ్రా.. వెన్ను గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి దూరమయ్యాడు. మూడోసారి టోర్నీని దక్కించుకోవాలని ఆశపడిన భారత్ కు ఇది పెద్ద దెబ్బ. అనుభవజ్ఞుడైన బుమ్రా లేకపోవడం ఇండియా అవకాశాల్ని దెబ్బ తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ టోర్నీలో దాదాపుగా ఇద్దరు కొత్త పేసర్లతోనే బరిలోకి దిగుతుందని చెప్పాలి. అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా లాంటి అనుభవం లేని పేసర్లపై ఆధార పడుతోంది. వెటరన్ మహ్మద్ షమీ ఉన్నా, గాయాల బెడద, ఫామ్ లేకపోవడం ప్రతికూలాంశం. ఏదేమైనా ఇంతటి ప్రముఖ టోర్నీ ముందు బుమ్రా దూరం కావడంపై భారత అభిమానులు ఫీల్ అవుతున్నారు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ , బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచి తను సత్తా చాటాడు. ఈ టోర్నీలతో తను ఉంటే ప్రభావవంతంగా ఉండేవాడని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.
టీ20ల నుంచి వన్డేలకు..
అర్షదీప్ సింగ్ భారత్ తరపున టీ20ల్లో అత్యంత విజయవంతమైన బౌలర్. 99 వికెట్లతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. అయితే వన్డేల్లో మాత్రం అతని సేవలు వినియోగించుకోవడం లేదు. ఇప్పటివరకు కేవలం తను 9 వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో 14 వికెట్లను 23 సగటుతో తీశాడు. ఇవి చాలా డీసెంట్ నెంబర్లే, అయినప్పటికీ అటు వన్డేలు., ఇటు టెస్టులకు తను పరిగణించడం లేదు. తను లెఫ్టార్మ్ పేసర్ కాబట్టి, బౌలింగ్ లో వైవిధ్యం ఉంటుంది. ప్రధాన జట్లలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కొనే బలహీనత ఉంటుంది. భారత్ ను చెడుగుడు ఆడుకునే ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ లెఫ్టార్మ విషయంలో బ్యాట్లెత్తేస్తాడు. దీంతో ఇలాంటి పేసర్ ను గ్రూమ్ చేయాల్సిన అవసరం ఉంది.
రానా మీద బాగా ఫోకస్..
హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ ఎంపికయ్యాక ఐపీఎల్లో తను మెంటార్ చేసిన ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్ల పట్ల పోకస్ బాగా పెట్టాడని విమర్శలు వస్తున్నాయి. హర్షిత్ రానాను చూస్తే అది నిజమని తెలియక మానదు. వితిన్ షార్ట్ ఆఫ్ టైంలో తను మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో తేలిపోగా, లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపించాడు. అతని కోసం హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. మిడిల్ ఓవర్లలో తను ఎఫెక్టివ్ గా లేడనే సాకు చెప్పి తప్పించారు. ఏదేమైనా బౌలర్ విఫలమవుతుంటే సరిదిద్దాలి, కానీ ఇలా పక్కన పెట్టడం ఏంటని అతని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి కాస్త బలహీనమైన పేస్ దళంతో మెగాటోర్నీకి వెళుతున్న భారత్.. భారం అంతా ఐదుగురు స్పిన్నర్లపైనే పెట్టింది. వాళ్లు సత్తా చాటుతూనే నాకౌట్ కు చేరుతుంది. ఈనెల 20న బంగ్లాదేశ్ తో ఢీ ద్వారా టోర్నీలో తన ప్రస్థానాన్ని భారత్ ప్రారంభిస్తుంది.




















