High Speed rail: హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
South India: దక్షిణ భారత్ లోని ప్రధాన నగరాలను కలిపేలా హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ను నిర్మించడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇది పూర్తయితే రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు వెళ్లొచ్చు.

High Speed rail project : దక్షిణాదిలో మూడు మెట్రో నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై. బెంగళూరు, చెన్నై కాస్త దగ్గరగానే ఉంటాయి కానీ హైదరాబాద్ మాత్రం దూరమే. ఆయా నగరాల్లో ఏదైనా పని పెట్టుకోవాలంటే.. ఒక రోజు ముందుగా షెడ్యూల్ ఖరారు చేసుకోవాలి. లేదంటే విమానాలను ఆశ్రయించాలి. ఎందుకంటే రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా కనీసం పన్నెండు గంటల జర్నీ ఉంటుంది. కానీ ఈ బాధ లేకుండా కేవలం రెండు అంటే రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరు చేరుకునే సౌకర్యాలన్ని కల్పించేందుకు కేంద్రం సిద్ధమయింది.
మూడు ప్రధాన నగరాలను కలుపుతూ హై స్పీడ్ నెట్ వర్క్
హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ పై కేంద్రం విస్తృతంగా పరిశీలన జరుపుతోంది. వయబిలిటీ ఉంటే ప్రధాన రూట్లలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఉంటుంది. ఈ హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో.. చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణీకులను చేరుకుంటాయి. ఈ నగరాలకు విమాన ప్రయాణం గంటన్నర వరకూ పడుతోంది. అది కేవలం ఎయిర్ టైమ్. ఇక విమానాశ్రయానికి వెళ్లడం .. అక్కడ్నుంచి సిటీలోకి వెళ్లడం అంత కంటే రెట్టింపు సమయం తీసుకుంటుంది. పైగా విమాన ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యం కాదు.
అందుకే కేంద్రం రెండు హైస్పీడ్ రైళ్ల కోసం కారిడార్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 గంటల సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్-చెన్నై కారిడార్ 705 కి.మీ, హైదరాబాద్-బెంగళూరు మార్గం 626 కి.మీ. ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే హై స్పీడ్ రైల్ నెట్ వర్క్ కోసం ఆర్‌ఐటీఈఎస్ లిమిటెడ్‌ను సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది. సర్వే మరియు అంచనాకు నిధులు కూడా కేటాయించారు.
పనులు అనుకున్నట్లుగా జరిగితే పదేళ్లలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్
ఈ హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ కు ఇప్పుడు ఉన్న రైలు పట్టాలు సరిపోవు. కొత్త కారిడార్లు ప్రత్యేకంగా హై-స్పీడ్ రైళ్ల కోసం నిర్మించాల్సి ఉంది. బుల్లెట్ రైలు నడిచే విధంగా పట్టాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ట్రాక్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టం కానీ.. కనీసం పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.
Also Read : ఇండియా-యూఎస్ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్ చెప్పిన ట్రంప్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

