By: Arun Kumar Veera | Updated at : 15 Feb 2025 12:36 PM (IST)
గేలానికి చిక్కితే మీ కష్టార్జితం దొంగలపాలు! ( Image Source : Other )
Cyber Fraud: క్రెడిట్ కార్డ్ పేరిట స్కామర్లు చేసే కొత్త మోసం కేసు వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు, కానీ కూడా అప్రమత్తం కూడా అవుతారు. ఈ కొత్త మోసం పద్ధతిలో, స్కామర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులమని చెప్పుకుంటూ ప్రజలకు ఫోన్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతామని ఊరిస్తూ, కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లతో గాలం వేస్తున్నారు.
మోసం గురించి వెల్లడించిన రెడ్డిట్ యూజర్
Fresh_Journalist5116 ID ఉన్న రెడ్డిట్ (Reddit) యూజర్ ఒకరు ఈ ఆన్‌లైన్ ఫ్రాడ్ గురించి షేర్ చేశాడు. అతని తండ్రి ఈ మోసానికి బలైపోయేవాడని, చివరి నిమిషంలో బయటపడ్డామని వెల్లడించాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగిగా నటిస్తూ, స్కామర్ తన తండ్రికి ఫోన్ చేశాడని, ఒక లింక్ కూడా పంపాడని రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు.
అతను చెప్పిన వివరాల ప్రకారం, రెడ్డిట్ యూజర్ తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి, తాను స్టేట్ బ్యాంక్ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. బ్యాంక్ తన కస్టమర్లకు ఇస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా, తన తండ్రి వాడుతున్న ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతామని అవతలి వ్యక్తి చెప్పాడు. అంతేకాదు, ఆ క్రెడిట్ కార్డుపై విధించిన వార్షిక రుసుములను కూడా రద్దు చేయవచ్చని ఆశ పెట్టాడు. దీని కోసం e-KYC అప్‌డేట్ చేయాలని సూచించాడు. ఈ తన తండ్రి దాదాపుగా అతని ఉచ్చులో పడ్డాడని రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు. కానీ, తనకు అనుమానం రావడంతో ఆ మోసగాడి పన్నాగం పారలేదని చెప్పాడు. తనకు ఎందుకు అనుమానం వచ్చిందో కూడా రెడ్డిట్ యూజర్ వివరించాడు.
రెడ్డిట్ యూజర్‌కు వచ్చిన అనుమానం ఇదీ..
స్కామర్ మాటలను తన తండ్రి నమ్మగానే, అతను e-KYC అప్‌డేట్ పేరుతో తన తండ్రి మొబైల్ నంబర్‌కు ఒక లింక్ పంపాడు. అదృష్టవశాత్తు, ఆ లింక్‌ను రెడ్డిట్ యూజర్ కూడా చూశాడు. ఆ లింక్ URL wixsite.com తో ముగియడం గమనించాడు. ఇక్కడే రెడ్డిట్ యూజర్‌కు అనుమానం వచ్చింది. ఏదో తప్పు జరుగుతోందని భావించాడు. వెబ్‌సైట్ పేజీలోనూ చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం అతను గమనించాడు.
"నేను ఆ వెబ్‌సైట్‌ను తనిఖీ చేశాను. ఆ వెబ్‌సైట్ నకిలీదని అర్ధమైంది. పైభాగంలో WIX సైట్ కోసం ఒక ప్రకటన ఉంది & URL కూడా wixsite.com తో ముగిసింది. అంటే, ఈ సైట్‌ను WIXలో డెవలప్ చేసి ఉండవచ్చు. అంతేకాదు, తరువాతి పేజీలో 'Expari date', Intar OTP' వంటి స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి" - రెడ్డిట్ యూజర్
మరో తప్పుతో అనుమానం నిజం చేసిన స్కామర్
SBI ఉద్యోగి పేరుతో స్కామర్ పంపిన ID కార్డు కూడా నకిలీదని రెడ్డిట్ యూజర్ గుర్తించాడు. ఎందుకంటే, ఆ ఐడీ కార్డ్‌లోని కార్యాలయ చిరునామా సరైనది కాదు. ఈ తప్పును కూడా పట్టుకున్న రెడ్డిట్ యూజర్, తన తండ్రికి ఫోన్ చేసిన వ్యక్తి మోసగాడని నిర్ధారించుకున్నాడు. దీంతో, మోసం బారిన పడకుండా చివరి నిమిషంలో తన తండ్రిని రక్షించాడు.
మన దేశంలో, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అప్‌డేట్స్, ఇతర ఆఫర్ల పేరిట చాలా మోసం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీటి గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సహా అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కస్టమర్ అప్రమత్తత మాత్రమే అతని కష్టార్జితాన్ని రక్షిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ELI స్కీమ్ కోసం UAN యాక్టివేట్ చేయడానికి ఇదే చివరి తేదీ - మిస్ చేస్తే రూ.15,000 పోతాయ్!
Gold Price: బంగారం రన్ ఇప్పట్లో ఆగదా! ధర 1.50 లక్షలకు చేరుకుంటుందా?
Railway Tatkal Ticket Booking Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ మారాయి - ఇకపై OTP తప్పనిసరి!
Rent Agreement Rules 2025 : అద్దెదారుల టెన్షన్‌కు పుల్‌స్టాప్, గృహ యజమానులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Silver Price: బంగారానికి పోటీగా వెండి రికార్డు పరుగు! 1.77 లక్షలకు చేరిన ధర
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan: ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?