Kiran Rao: సిగ్గులేకుండా ఆయన పేరు వాడుకుంటా - అమీర్ ఖాన్‌పై మాజీ భార్య కిరణ్ రావు కామెంట్స్
Kiran Rao and Aamir Khan: కిరణ్ రావు, అమీర్ ఖాన్ కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నా కూడా కలిసి పనిచేస్తున్నారు. తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌లో అమీర్ పేరును ఉపయోగించుకోవడంపై కిరణ్ వ్యాఖ్యలు చేశారు.
Kiran Rao about Aamir Khan: సినీ పరిశ్రమలో విడాకులు కామన్ అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ టాలీవుడ్‌లో జరుగుతున్న విడాకులకు, బాలీవుడ్‌లో జరుగుతున్న విడాకులకు చిన్న తేడా ఉంది. టాలీవుడ్‌లో ఒక జంట విడిపోతే.. మళ్లీ ఒకరిని ఒకరు కలుసుకోవడం గానీ, కలిసి పనిచేయడం గానీ జరగదు. బాలీవుడ్‌లో అలా కాదు.. పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను వేర్వేరుగా చూసేవాళ్లు అక్కడ ఎక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా ఒకరు. వీరిద్దరూ కొన్నేళ్ల క్రితం విడాకుల గురించి ప్రకటించినా.. అప్పటినుండి కలిసే పనిచేస్తున్నారు. తాజాగా తన సినిమా ప్రమోషన్ కోసం అమీర్ ఖాన్ పేరును కూడా ఉపయోగించుకుంటోంది కిరణ్ రావు.
కచ్చితంగా ఉపయోగించుకుంటాను..
కిరణ్ రావు.. తాజాగా ‘లాపతా లేడీస్’ అనే సినిమాను డైరెక్ట్ చేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లలో దీని గురించి ప్రమోషన్ కూడా చేసింది. అదే క్రమంలో తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన మాజీ భర్త అమీర్ ఖాన్‌తో ప్రస్తుతం తనకు ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. అయితే తన సినిమా ప్రమోషన్ కోసం అనవసరంగా అమీర్ ఖాన్ పేరును ఉపయోగించుకుంటున్నారా అని కిరణ్ రావుకు ముక్కుసూటిగా ప్రశ్న ఎదురయ్యింది. ‘‘కచ్చితంగా. నేను తనను అన్నిరకాలుగా ఉపయోగించుకుంటాను. ఎక్కడ కుదిరితే అక్కడ నేను తన స్టార్ పవర్‌ను ఉపయోగించుకుంటాను. వచ్చి మాతో ఫోటోలు దిగు అని అడుగుతూ ఉంటాను’’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది కిరణ్ రావు.
రండి. వచ్చి చూడండి..
‘‘మేము చిన్న సినిమాను తీశాం. అందుకే ప్రేక్షకులకు కుదిరినంత వరకు రీచ్ అయ్యేలా చేయాలి. మార్చి 1న వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి. అమీర్ ఖాన్ నిర్మించాడు. ఆయన సినిమానే. రండి. వచ్చి చూడండి అని సిగ్గులేకుండా ఆయన్ని వాడుకుంటా’’ అంటూ అమీర్ ఖాన్ పేరును తాను ప్రమోషన్స్ విషయంలో ఎలా ఉపయోగించుకుంటుందో చెప్పుకొచ్చింది కిరణ్ రావు. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలయిన ‘లాపతా లేడీస్’ పాజిటివ్ రివ్యూలను అందుకుంటోంది. క్లీన్ కామెడీతో కిరణ్ రావు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా తెరకెక్కించిందని చూసిన ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇందులో లీడ్ రోల్స్ చేసిన నితాన్షి, ప్రతిభలకు ఇది మొదటి సినిమానే అయినా వారి నటనే సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్తున్నారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్..
నితాన్షి గోయెల్, ప్రతిభ రాంతాతో పాటు స్పర్శ్ శ్రీవాత్సవ, రవి కిషన్, చాయా కదమ్ కూడా ‘లాపతా లేడీస్’లో లీడ్ రోల్స్‌లో కనిపించారు. గతేడాది ఈ సినిమా టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీన్ అయ్యింది. తాజాగా విడుదలయిన ‘ఫైటర్’ చిత్రానికి ఈ సినిమా ట్రైలర్‌ను అటాచ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జియో సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేసింది. జ్యోతి దేశ్‌పాండే దీనికి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అమీర ఖాన్ ప్రొడక్షన్, కిండ్లింగ్ ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా ‘లాపతా లేడీస్’ను నిర్మించారు. బిప్లబ్ గోస్వామి దీనికి స్క్రిప్ట్‌ను అందించగా.. స్నేహా దేశాయ్ డైలాగులు రాశారు. ఇప్పటికే అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్ చేశాడు.
Also Read: ఈయన చాలా డేంజర్, అందరిలా కాదు - ‘గామి’ దర్శకుడు విద్యాధర్‌పై అభినయ వ్యాఖ్యలు