అన్వేషించండి

Abhinaya: ఈయన చాలా డేంజర్, అందరిలా కాదు - ‘గామి’ దర్శకుడు విద్యాధర్‌పై అభినయ వ్యాఖ్యలు

Abhinaya: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గామి’లో అభినయ కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమాలో తనకు ఎదురైన అనుభవాల కోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బయటపెట్టింది.

Abhinaya at Gaami Trailer Launch Event: యంగ్ హీరో విశ్వక్ సేన్.. తన రొటీన్ కమర్షియల్, కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ‘గామి’ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. విద్యాధర్.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతుండగా.. దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మూవీ టీమ్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసింది. దీనికి సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. ఇక ఇందులో కీలక పాత్ర పోషించిన అభినయ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌లో సినిమా గురించి, డైరెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అభినయ.

చాలా డిఫరెంట్‌గా అనిపించింది..

‘‘ముందు నేను మా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆయన చాలా డేంజర్. ఆయనతో వర్క్ చేయడం చాలా కష్టం. 2018లో నన్ను కలిశారు. ఆరేళ్లు కలిసి వర్క్ చేశాం. నాకు స్క్రిప్ట్ చెప్పి, ఓకే చేసి షూట్‌కు వెళ్లిన తర్వాత అసలు ఆయన డైరెక్టర్ అంటే నేను నమ్మలేదు. ఇంత సాఫ్ట్‌గా ఉన్నారు, అసలు ఈయన డైరెక్షన్ చేస్తారా, అసలు ఏం అనట్లేదు అనుకున్నాను. నాకు తెలీదు కాబట్టి ఇది పెద్ద ఫీచర్ ఫిల్మ్ కాదేమో చిన్న మూవీ అయ్యిండొచ్చు అనుకున్నాను. తర్వాత వైజాగ్‌లో ఒక షూట్ లొకేషన్‌కు వెళ్లాం. అక్కడ అసలు ఎక్కువమంది క్యాస్ట్ అండ్ క్రూ లేరు. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. డైరెక్టర్ ఒక చిన్న కెమెరా పట్టుకొని 15 రోజుల్లో నా షూట్ పూర్తిచేసేశారు’’ అంటూ ‘గామి’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది అభినయ.

ఈ డైరెక్టర్ అలా కాదు..

ముందుగా ‘గామి’ ఫీచర్ ఫిల్మ్ అంటే తను నమ్మలేదని, కానీ తన తండ్రి, అన్న కలిసి సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పారని గుర్తుచేసుకుంది అభినయ. అంతే కాకుండా హను రాఘవపూడి కూడా సినిమా చూసి బాగుందని ప్రశంసించారని బయటపెట్టింది. ‘గామి’ని పెద్ద స్క్రీన్‌పై చూసిన తర్వాత తను చాలా సర్‌ప్రైజ్ అయ్యానని చెప్పుకొచ్చింది. ‘‘మామూలుగా డైరెక్టర్స్ అంటే కోపంగా ఉంటారు, అరుస్తుంటారు, ఏదేదో అంటుంటారని అనుకుంటారు. కానీ ఈయన అలా కాదు’’ అని దర్శకుడిని ప్రశంసిస్తూ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పుకుంది అభినయ. ‘గామి’ కోసం ఆరేళ్ల నుండి పనిచేస్తున్నా కూడా ఎప్పుడూ సినిమాను వదిలి వెళ్లలేదని నిర్మాత కార్తిక్‌ను ప్రశంసించింది.

నాకు నచ్చుతాయి..

‘‘విశ్వక్ సేన్ సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మీ ఎక్స్‌ప్రెషన్స్ నాకు చాలా నచ్చుతాయి. కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ’’ అని విశ్వక్ సేన్‌ను ప్రశంసించింది అభినయ. ఇక స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చూశానని చెప్పుకొచ్చింది. అసలు ‘గామి’ స్టోరీ ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే విషయాలను ట్రైలర్‌లో పెద్దగా రివీల్ చేయలేదు దర్శకుడు. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: నాకు ఈ సమస్య ఎప్పుడు వచ్చింది? ఇక్కడ బతకలేను.. నా వల్ల కాదు - అఘోరగా భయపెట్టిన విశ్వక్‌, 'గామి' ట్రైలర్‌ చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget