అన్వేషించండి

Gaami Trailer Out: నాకు ఈ సమస్య ఎప్పుడు వచ్చింది? ఇక్కడ బతకలేను.. నా వల్ల కాదు - అఘోరగా భయపెట్టిన విశ్వక్‌, 'గామి' ట్రైలర్‌ చూశారా?

Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ గామి ట్రైలర్‌ రిలీజైంది. సరికొత్త పాత్రలో అలరించబోతున్న విశ్వక్ సేన్‌ లుక్‌, పాత్ర ట్రైలర్‌లో ఆసక్తిగా చూపించారు. అఘోరాలు, దేవదాసి చూట్టూ ఈ ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది

Gaami Trailer Release: విష్వక్ సేన్ లేటెస్ట్‌ మూవీ 'గామి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త డైరెక్టర్‌ విద్యాధర్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ మూవీపై అంచనాలు పెంచాయి. అఘోరగా విశ్వక్‌ లుక్‌కు భారీ బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా మూవీ టీం మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. ఒక వింత జబ్బుతో బాధపడుతున్న హీరో దానిని నుంచి బయటపెడేందుకు అఘోరలు అతడికి సాయం చేస్తాయి. అయితే ఆ సమస్య నుంచి అతడు బయటపడటానికి 36 ఏళ్లకి ఒకసారి హిమాలయాల్లో జరిగే అద్భుతానికి సంబంధం ఉంటుంది. దాని కోసం హిమలయాలకు వెళ్లిన హీరోకు ఎదురైన పరిణామాలు, దైవశక్తి చూట్టూ ఈ ట్రైలర్‌ ఉత్కంఠగా సాగింది.

ట్రైలర్‌లో ఏముందంటే

నేను ఎవరో? ఎక్కడి నుంచి వచ్చానో? ఈ సమస్య ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఎందుకు ఉన్నాను? నాకేం గుర్తు రావడం లేదు అంటూ విశ్వక్‌ సేన్‌ డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ మొదలైంది. అనంతరం అఘోర పాత్ర ఒకటి మా మేలు కోసం నువ్వు ఆశ్రమం వీడాల్సి ఉంటుంది అని అనడం, దానికి మరో వ్యక్తి అతడికి ఉన్న సమస్యతో ఎక్కడికిపోతాడు. ఎలా బతుకుతాడంటారు. ఆ తర్వాత అతడి సమస్యకు పరిష్కరం హిమలయాల్లోనే ఉందని చెబుతూ ట్రైలర్‌ ఆద్యాంతంగా ఆసక్తిగా మలిచారు. అలాగే ట్రైలర్‌ దేవదాసి పాత్రని పరిచయం చేశారు. మొత్తానికి ఈ ట్రైలర్‌ మూడు పాత్రల చూట్టు తిరిగింది హీరో అఘోర పాత్ర, దేవదాసి, బంధిగా ఉన్న ఓ కుర్రాడి పాత్ర ట్రైలర్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటీ, అసలు హీరో అఘోరగా ఎందుకు మారాడు అనేది మార్చి 8న థియేటర్లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఎలాంటి క్యారెక్టర్ లోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు విశ్వక్. మాస్‌ రోల్స్‌కి కేరాఫ్‌ అయిన విశ్వక్‌ ఈసారి సరికొత్తగా గెటప్‌తో, వైవిధ్యమైన కథతో ఫ్యాన్స్‌ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. విశ్వక్ సేన్ చాలా కాలంగా గామి సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

Also Read: దీపికా పదుకొణె ప్రెగ్నెంట్.. ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' పరిస్థితి ఏంటి?  

విద్యాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, అనుకున్న సమయానికి షూట్ కంప్లీట్ కాలేదు. ఈ సినిమా పనులు సైతం నత్తనడకన సాగాయి. ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో అఘోరా అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లో ఆయన క్యారెక్టర్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ పాత్ర నభూతో నభవిష్యతి అన్నట్లు ఉండబోతుందట.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget