అన్వేషించండి

Kamal Haasan: ‘కల్కి 2898 AD’లో నా క్యారెక్టర్ అదే, ఇండియన్ 2 మాత్రమే 3 కూడా పూర్తయ్యింది - కమల్ హాసన్

Kamal Haasan: కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందులో తన అప్‌కమింగ్ సినిమాల గురించి ఆసక్తికర అప్డేట్ అందించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశారు.

Kamal Haasan about Kalki 2898 AD and Indian 2: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా సీనియర్ హీరోలదే హవా సాగుతోంది. యంగ్ హీరోలకంటే సీనియర్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంతే కాకుండా వారు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందులో కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్ కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్.. తన అప్‌కమింగ్ సినిమాల గురించి బయటపెట్టారు. ఇప్పటికే ఆయన.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 AD’లో ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో తన పాత్ర ఎలా ఉంటుందో ఈ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు.

రెండూ పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే..

కమల్ హాసన్ చివరిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’లో హీరోగా కనిపించారు. ఆ తర్వాత ఆయన వెండితెరపై కనుమరుగయిపోయారు. అందుకే 2024లో తను చేస్తున్న ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇచ్చారు కమల్. ‘‘సినిమాల ప్రొడక్షన్‌ను ఎప్పుడూ తొందరపడి చేయకూడదు ఎందుకంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం కాబట్టి. నేను ఇండియన్ 2, ఇండియన్ 3ను పూర్తిచేశాను. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కల్కి 2898 ADలో నేను ఒక గెస్ట్ రోల్ చేశాను’’ అంటూ బ్యాక్ టు బ్యాక్ ఆయన చేస్తున్న చిత్రాల గురించి వివరించారు కమల్ హాసన్.

ఎన్నో ఇబ్బందులు..

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో చాలా ఏళ్ల క్రితం ‘భారతీయుడు’ సినిమా వచ్చింది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. కానీ ‘ఇండియన్ 2’ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే వచ్చింది. చాలాకాలం పాటు షూటింగ్ ముందుకు కొనసాగలేదు కూడా. కానీ మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించి సైలెంట్‌గా దానిని పూర్తి చేసినట్టు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. గతేడాది నవంబర్‌లో ఇంట్రో పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. ‘ఇండియన్ 2’కు సంబంధించిన ఈ గ్లింప్స్‌.. కమల్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది కాబట్టి త్వరలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

విడుదల తేదీ అదే..

ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘ఇండియన్ 2’ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ వృద్ధుడిగా కనిపించాల్సి ఉంటుంది. దానికోసం ఆయన నాలుగు గంటలు మేకప్‌కే కేటాయించాల్సి వచ్చిందని చాలాకాలం క్రితమే దర్శకుడు శంకర్ తెలిపారు. రెండు గంటలు మేకప్ వేయడానికి, రెండు గంటలు మేకప్ తీయడానికి సరిపోయేదని బయటపెట్టారు. ‘ఇండియన్ 2’ కమల్ హాసన్ వృద్ధుడిలాగా మాత్రమే కాకుండా మధ్య వయసు ఉన్న పాత్రలో కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. మరో కీలక పాత్రలో హీరోయిన్స్ రకుల్, ప్రియా భవానీ శంకర్ నటించారు. 

Also Read: 'రంగస్థలం' కాంబో ఈజ్ బ్యాక్ - ఈసారి పాన్ వరల్డ్ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకునేలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Ind Vs NZ Latest Updates: నేడే కివీస్ తో భార‌త పోరు.. గెలిస్తే టేబుల్ టాప‌ర్.. సెమీస్ లో ఆసీస్ తో ఢీ..!! టీమిండియాలో 2 మార్పులు..!
నేడే కివీస్ తో భార‌త పోరు.. గెలిస్తే టేబుల్ టాప‌ర్.. సెమీస్ లో ఆసీస్ తో ఢీ..! టీమిండియాలో 2 మార్పులు..!
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Ind Vs NZ Latest Updates: నేడే కివీస్ తో భార‌త పోరు.. గెలిస్తే టేబుల్ టాప‌ర్.. సెమీస్ లో ఆసీస్ తో ఢీ..!! టీమిండియాలో 2 మార్పులు..!
నేడే కివీస్ తో భార‌త పోరు.. గెలిస్తే టేబుల్ టాప‌ర్.. సెమీస్ లో ఆసీస్ తో ఢీ..! టీమిండియాలో 2 మార్పులు..!
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Samsung A56: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
96 Movie - Vijay Sethupathi: విజయ్ సేతుపతి కాదు... బాలీవుడ్ హీరో కోసం రాసిన కథ... కల్ట్ క్లాసిక్ '96'ను మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?
విజయ్ సేతుపతి కాదు... బాలీవుడ్ హీరో కోసం రాసిన కథ... కల్ట్ క్లాసిక్ '96'ను మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?
Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Embed widget