అన్వేషించండి

RC 17 Movie: 'రంగస్థలం' కాంబో ఈజ్ బ్యాక్ - ఈసారి పాన్ వరల్డ్ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకునేలా

RC 17 Announcement: 'రంగస్థలం' కాంబోలో కొత్త సినిమాను ఇవాళ అనౌన్స్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 17వ చిత్రమిది.

'రంగస్థలం'... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్. హీరోగా ఆ సినిమాకు ముందు ఆయనకు బోలెడు విజయాలు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'మగధీర' సైతం ఉంది. అయితే... అంతకు ముందు సినిమాల్లో కనిపించిన చరణ్ వేరు, 'రంగస్థలం'లో కనిపించిన చరణ్ వేరు. నటుడిగా ఆయన స్థాయిని, స్థానాన్ని పెంచిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ 'రంగస్థలం' కాంబోలో మరో సినిమా రెడీ అవుతోంది. ఇవాళ ఆ చిత్రాన్ని (RC 17 Movie) అధికారికంగా అనౌన్స్ చేశారు.

సుక్కు దర్శకత్వంలో చరణ్...
RC 17 Film అనౌన్స్ చేశారోచ్!
రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. 'రంగస్థలం' తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను సైతం ప్రొడ్యూస్ చేస్తోంది. సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాణ భాగస్వామి. నవీన్ ఎర్నేని,  రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. 

హీరోగా రామ్ చరణ్ 17వ చిత్రమిది. అందుకని, RC 17 Movie అని పిలుస్తున్నారు. సినిమా ప్రకటనతో హీరో, దర్శకుడు దిగిన ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది చిత్రీకరణ ప్రారంభించడంతో పాటు 2025 లాస్ట్ క్వార్ట్రర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయితే... 'పుష్ప'తో సుకుమార్ ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను మెప్పించారు. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే నేషనల్, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎదురు చూస్తారు. అందుకు తగ్గట్టు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది. 

Also Read: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?

'రంగస్థలం' తర్వాత హీరోగా రెండు సినిమాలు, ప్రత్యేక పాత్రలో ఓ సినిమా చేశారు రామ్ చరణ్. 'వినయ విధేయ రామ', 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం', 'ఆచార్య' సినిమాలు విడుదల చేశారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే... 'రంగస్థలం' తర్వాత 'పుష్ప: ది రైజ్' ఒక్కటే విడుదల చేశారు. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ కొత్త సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్

రామ్ చరణ్ హీరోగా...
గురుశిష్యులు ఒకేసారి!
రామ్ చరణ్ ఇటీవల తన 16వ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆ సినిమాకు 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఆ సినిమా తెరకెక్కుతోంది. 'ఉప్పెన'తో పాటు 'రంగస్థలం', 'పుష్ప' సినిమాలను సైతం మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా గురుశిష్యులు సుకుమార్, బుచ్చి బాబులతో ఒకేసారి సినిమాలు అనౌన్స్ చేసింది. ఈ రెండు కాకుండా స్టార్ హీరోలతో పలు భారీ సినిమాలు ఆ సంస్థలో తెరకెక్కుతున్నాయి.

Also Readమధురము కదా... విజయ్ దేవరకొండ, మృణాల్ జోడీ & శ్రేయా ఘోషల్ వాయిస్ - సాంగ్ ఎలా ఉందో విన్నారా?

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi : చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget