Family Star New Song: మధురము కదా... విజయ్ దేవరకొండ, మృణాల్ జోడీ & శ్రేయా ఘోషల్ వాయిస్ - సాంగ్ ఎలా ఉందో విన్నారా?
Watch Madhuramu Kadha Song In Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఇందులో మూడో పాట 'మధురము కదా'ను నేడు విడుదల చేశారు.
మధురము కదా... గోపీసుందర్ (Gopi Sundar) ట్యూన్ కట్టిన తర్వాత సాంగ్ రాసిన లిరిసిస్ట్ శ్రీమణి (Lyricist Srimani) ఆ రెండు వర్డ్స్ కాయినింగ్ చేశారో? లేదంటే ఆయన పాట రాసిన తర్వాత దర్శకుడు పరశురామ్ పెట్ల 'మధురము కదా' అని అన్నారో? లేదంటే సాంగ్ అండ్ విజువల్స్ చూసి ప్రొడ్యూసర్లు 'దిల్' రాజు, శిరీష్ 'మధురము కదా' అన్నారో? ఏది ఏమైనా సరే... 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మూడో పాట మధురమే!
మళ్లీ మళ్లీ చూసేందుకు...
వినేందుకూ 'మధురమే కదా'!
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ పెట్ల దర్శకుడు. 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు సినిమాలో మూడో పాట 'మధురము కదా'ను విడుదల చేశారు.
Being in love is a sweet feeling. Being loved, is the sweetest ❤️#FamilyStar Third Single #MadhuramuKadha out now ❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) March 25, 2024
🎶 https://t.co/WusptTRWix
In the lovely voice of @shreyaghoshal ✨#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan…
గోపీసుందర్ స్వరకల్పనలో శ్రీమణి రాసిన 'మధురము కదా'ను శ్రేయా ఘోషల్ పాడారు. మాంచి మెలోడియస్ బాణీ, వినసోంపైన సాహిత్యానికి ఆమె మధురమైన గొంతు తోడు కావడంతో పాట మరింత మధురంగా మారింది.
'పించం విప్పిన నెమలికి మల్లె...
తొలకరి జల్లుల మేఘం అల్లే...
అలజడి హృదయం ఆడిన కూచిపూడి!
రంగులు దిద్దిన బొమ్మకు మల్లె...
కవితలు అద్దిన పుస్తకం అల్లే...
సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి'
అంటూ 'మధురము కదా' సాకీ సాగింది. అది వింటూనే పాటలోకి శ్రోతలు వెళ్లిపోవడం ఖాయం.
'మధురము కదా... ప్రతొక్క నడక నీతో కలిసి ఇలా
తరగని కథ... మనది గనుక మనసు మురిసేనిలా!
ఉసురేమో నాదైనా... నడిపేది నీవుగా!
కసురైనా... విసురైనా... విసుగైన రాదుగా'అంటూ తర్వాత పల్లవి వచ్చింది. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ కావడం ఖాయం! పాట అంతా పూర్తిగా తెలుగు పదాలతో, సామాన్య ప్రేక్షకులకు సైతం అర్థమయ్యే భాషలో రాసిన శ్రీమణిని మెచ్చుకోకుండా ఉండలేం.
Also Read: ఆ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? - రామ్ చరణ్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ రిప్లై
గురువారం 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ విడుదల
సినిమా విడుదలకు పది రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. 'మధురము కదా' కంటే ముందు విడుదల చేసిన 'నందనందా...', 'కల్యాణీ వచ్చా వచ్చా...' పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మార్చి 28... అంటే రాబోయే గురువారం 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Also Read: 'సాహో' హీరోయిన్ దొరికేసిందా? లేదంటే కావాలని అలా చేసిందా?