అన్వేషించండి

Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Deputy CM Bhatti Vikramarka: పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ మోడల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యమని భట్టి విక్రమార్క అన్నారు. రైజింగ్ సమ్మిట్ లో ఆయన ఎకానమీ అంశంపై చర్చలో పాల్గొన్నారు.

Private partnership model: త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనకు ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్  లు అని వార్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన గ్లోబల్ సమ్మిట్ వేదికలో నిర్వహించిన  Innovative PPPS:
HARNESSING PRRIVATE CAPITAL TOWARDS PUBLIC GOODS చర్చా గోష్టిలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 

మూడు ప్రధాన మోడల్స్ తో పెట్టుబడుల ఆకర్షణ 

 తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో, Vision 2047 లక్ష్యంగా పెట్టుకున్న  3 ట్రిలియన్ అమెరికా డాలర్ ఆర్థిక వ్యవస్థ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరిస్తున్న ఈ సందర్భంలో, ఒక నిజం స్పష్టంగా నిలుస్తుందన్నారు. మన USD 200 బిలియన్ GSDP, 37% ఇన్వెస్ట్‌మెంట్ రేటుతో సంవత్సరానికి USD 70–75 బిలియన్ తెచ్చినా, ఈరోజే USD 30 బిలియన్ పెట్టుబడి లోటు ఉంది, దీని వ్యత్యాసం వేగంగా పెరుగుతోంది, ఈ లోటును పూడ్చేందుకు CURE (Core Urban), PURE (Peri-Urban), RARE (Rural Agri) జోన్‌ల అభివృద్ధికి PPPలు ఇంధనం పనిచేస్తాయని డిప్యూటీ సీఎం వివరించారు. మెట్రోలు, సోలార్ పార్కులు, స్కిల్ హబ్‌లు వంటి రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం వేస్తూ, మానవాభివృద్ధి ,  నెట్-జీరో లక్ష్యాలకు ప్రభుత్వ నిధులను కేటాయించే అవకాశం PPP లు ఇస్తాయి అన్నారు.

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం, ఆతిథ్యం తెలంగాణ ఫిలాసఫీ అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, తక్కువ ధరకు నైపుణ్యం తో కూడిన స్కిల్ లేబర్, శాంతి భద్రతలు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయని వివరించారు. పెట్టుబడిదారులను రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తోంది, రండి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టండి కలిసి పనిచేద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేట్ భాగస్వాములు రికార్డు సమయంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లక్షలాది మందికి ట్రాఫిక్ ఉపశమనం కలిగించడమే కాక, ఫార్మా కంపెనీలు,  టెక్ హబ్‌లతో నిండి ఉన్న ఆర్థిక కారిడోర్లకు దారితీసిందనీ డిప్యూటీ సీఎం వివరించారు.అది కేవలం రహదారులనే మార్చలేదు, తెలంగాణ గమ్యాన్ని వేగవంతం చేసిందన్నారు. ధైర్యవంతమైన కొత్త కలలను PPPలు వాస్తవిక విజయాలుగా మార్చగలవని ఔటర్ రింగ్ రోడ్డు రుజువు చేసిందన్నారు.  బంధనాలన్నింటినుంచి బయటపడటానికి PPPలు ఉత్తమ మార్గం అన్నారు. రవాణా, పునర్వినియోగ ఇంధనం(గ్రీన్ ఎనర్జీ), డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సంస్థాగత పెట్టుబడులను ఆకర్షిస్తూ, ప్రమాదాలను తెలివిగా పంచుకుని విస్తృత స్థాయిలో పనులను పూర్తి చేస్తాయి డిప్యూటీ సీఎం వివరించారు.
 

లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.63 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమల అనుకూల విధానాల వల్ల గడచిన రెండేళ్లలో ఒక్క లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.63 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో మంగళవారం నాడు ఫ్యూచర్ సిటీపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రసంగించారు. తెలంగాణా గ్లోబల్ వ్యాక్సిన్స్ కేంద్రంగా గా అవతరించిందని ఆయన వివరించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తానికి తాము అండగా నిలిచామని తెలిపారు. వంద బిలియన్ డాలర్ల విలువైన 2,000 ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో పది పెద్ద ఫార్మా కంపెనీల్లో 8 తెలంగాణాలో ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వాల తీసుకున్న నిర్ణయాలను, విధానాలను కొనసాగిస్తూ పారిశ్రామిక రంగానికి ఏ ఆటంకాలు లేకుండా చూస్తున్నట్టు శ్రీధర్ బాబు చెప్పారు. గత 30 ఏళ్లుగా పాత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాల కొనసాగింపు జరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
Advertisement

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
Weakest Currency : ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Embed widget