Shraddha Kapoor: 'సాహో' హీరోయిన్ దొరికేసిందా? లేదంటే కావాలని అలా చేసిందా?
శ్రద్ధా కపూర్ ఆదివారం సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో ఒక పెండెంట్ ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేసింది. ఇన్ డైరెక్ట్ గా తన రిలేషన్షిప్ స్టేటస్ కన్ఫర్మ్ చేసిందా? అనే డౌట్స్ వస్తున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో నటించారు. హిందీలో అయితే ఆవిడ చాలా ఫేమస్. ప్రజెంట్ శ్రద్ధా వయసు 35 సంవత్సరాలకు పైమాటే. ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు. ఈ వయసు లోపు పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. కానీ, కనీసం తాను ప్రేమలో ఉన్నట్లు కూడా ఎప్పుడూ శ్రద్ధా కపూర్ చెప్పలేదు. అయితే... ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఎవరితో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుంది? అనేది అందిరికీ తెలుసు.
రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నారు. ఆ మధ్య అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి కాదు! అప్పుడు అతడితో వెళ్లారు. మీడియా / కెమెరా కంటికి దొరికేశారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి రిలేషన్షిప్ విషయంలో శ్రద్ధా కపూర్ దొరికేశారు. కావాలని ఆమె అలా చేసి ఉంటారని కొందరు సందేహిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
మెడలో చైన్, ఆ పెండెంట్ చూశారా?
శ్రద్ధా కపూర్ ఆదివారం సాయంత్రం దాటిన తర్వాత సోషల్ మీడియాలో నాలుగు సెల్ఫీలు పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఒక్కటే... మెడలో ఉన్న చైన్! మరీ ముఖ్యంగా దానికి ఉన్న పెండెంట్! 'ఆర్' అక్షరంతో కూడిన పెండెంట్ శ్రద్ధా కపూర్ ధరించారు. 'ఆర్ అంటే రాహుల్... రాహుల్ మోడీనే కదా' అని నెటిజన్స్, శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. అదీ సంగతి!
Also Read: బర్త్ డేకి కాదు... ఈ రోజే రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! కొత్త సినిమా ప్రకటన!
View this post on Instagram
ఎప్పుడైనా అనౌన్స్ చేయవచ్చు!?
శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ తన రిలేషన్షిప్ గురించి ఏ సమయంలో అయినా అనౌన్స్ చేయవచ్చని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేమలో పడిన తొలినాళ్లలో రహస్యంగా ఉంచినప్పటికీ... ఈ మధ్య కలిసి ఫోటోలు దిగడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. తమ వ్యక్తిగత జీవితాన్ని జనాలకు వీలైనంత దూరంగా ఉంచుతున్నారు. ఏ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
Also Read: ఆ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? - రామ్ చరణ్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ రిప్లై
R???? 😭
— 𝑄𝑢𝑒𝑒𝑛~𝑃𝐻♡ (@RealQueenPH) March 24, 2024
Rahul???😭😭#ShraddhaKapoor pic.twitter.com/QKwRb99EI6
'ప్యార్ కా పంచనామా 2', 'సోను కె టిటు కి స్వీటీ', 'తూ ఝూటీ మై మక్కర్' సినిమాలకు రాహుల్ మోడీ రైటర్. ఆయనది ముంబై. నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా కపూర్... ఆ తర్వాత కథానాయికగా తనకంటూ పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజెంట్ ఆమె 'స్త్రీ 2' చేస్తున్నారు.