అన్వేషించండి

అర్థరాత్రి అప్డేట్ - ఇప్పుడిదే ఇండస్ట్రీలో నయా ట్రెండ్, ఎందుకలా?

సినిమా రంగంలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ‌. ముహూర్తం చూడకుండా ఏదీ చేయరు. అయితే ఇటీవల కాలంలో అర్థరాత్రి ముహూర్తాలకు మూవీ అప్డేట్స్ రిలీజ్ చేయడానికి ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించే దగ్గర నుంచి, గుమ్మడికాయ కొట్టే వరకూ.. అన్నీ సెంటిమెంట్ తో ముడిపడి ఉంటాయి. ఫస్ట్ లుక్స్, టీజర్లు, ట్రైలర్స్, సాంగ్స్.. ఇలా ప్రతీది మంచి ముహూర్తం చూసే విడుదల చేస్తుంటారు. ఫలానా తేదీన ఫలానా సమయానికి అప్డేట్ వస్తుందని చెబుతూ, అనుకొన్న ముహూర్తం ప్రకార‌మే రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో 'అర్థరాత్రి' టైంలో లేదా తెల్లారుజామున కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రావడాన్ని మనం గమనించవచ్చు. ఒకరిని చూసి ఒకరు ఇదే పద్ధతిని ఫాలో అవ్వడంతో ఇప్పుడదే ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ గా మారిపోయింది. 

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్లూ 'ప్రాజెక్ట్ K' గా పిలవడిన ఈ సినిమా టైటిల్ ను, ఇటీవల శాన్‌ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేసారు. ఇండియా టైం ప్రకారం జులై 20న అర్థరాత్రి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న 'కంగువ' మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ని కూడా మిడ్ నైట్ రిలీజ్ చేశారు. Jul 22వ తేదీ రాత్రి 12 గంటలకు యూట్యూబ్ లో వదిలారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని స్టూడియో గ్రీన్ & యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలానే ధనుష్ నటిస్తున్న 'కెప్టెన్ మిల్లర్' సినిమా టీజర్ ను జులై 28 అర్థరాత్రి విడుదల చేశారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. 

Also Read: మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

లేటెస్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమా అప్డేట్ కూడా అర్ధరాత్రే వచ్చింది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా 12.00 AM కి ఓ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆగస్టు 9న మరో న్యూ పోస్టర్ వదిలారు కానీ, అది వేరే సంగతి. ఫస్ట్ పోస్టర్ లో సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరినీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో, వారి పేర్లు లేకుండా రెండో పోస్టర్ ను విడుదల చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 

ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా 'సలార్' పార్ట్-1 టీజర్ ను జూలై 6వ తేదీ ఎర్లీ మార్నింగ్ 5:12 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఇంగ్లీష్ డైలాగ్ తో ఈ వీడియోని కట్ చేసారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక డార్లింగ్ గత చిత్రం 'ఆదిపురుష్' సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఒకే టైంకి వచ్చేవి. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకూ అన్నీ ఉదయం గం.7:11 నిమిషాలకు రిలీజ్ చేసేవారు. 

అయితే ఇప్పటి వరకూ అర్థరాత్రి లేదా తెల్లవారుజామున విడుదల చేసిన సినిమాల గ్లిమ్స్, టీజర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముహూర్త బలం కుదరలేదేమో 'ఆదిపురుష్' మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి మిగతా చిత్రాల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ట్రెండ్ మాట ఎలా ఉన్నా.. దెయ్యాలు తిరిగే టైములో ఈ అప్‌డేట్‌లు ఏమిటిరా బాబు అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

Also Read: 'తమ్ముడు' పక్కన పెట్టేసిన రీమేక్ తో 'అన్నయ్య' హిట్టు కొడతాడా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
Viral Post:  గూగుల్ సీఈఓ పిచాయ్ ను స‌ర్ప్రైజ్ చేసిన టైటాన్స్.. ఆ ఆట‌గాడిని ఎందుకు ఆడించ‌డం లేదంటూ ఆయన ఎంక్వైరీ..  సోష‌ల్ మీడియాలో వైర‌లైన పోస్ట్
గూగుల్ సీఈఓ పిచాయ్ ను స‌ర్ప్రైజ్ చేసిన టైటాన్స్.. ఆ ఆట‌గాడిని ఎందుకు ఆడించ‌డం లేదంటూ ఆయన ఎంక్వైరీ.. సోష‌ల్ మీడియాలో వైర‌లైన పోస్ట్
Viral News: 2 వారాల కిందటే పెళ్లి - భర్తను చంపడానికి సుపారీ ఇచ్చేసింది - ఈ భార్య చాలా వయోలెంట్ !
వారాల కిందటే పెళ్లి - భర్తను చంపడానికి సుపారీ ఇచ్చేసింది - ఈ భార్య చాలా వయోలెంట్ !
Lady Don Sangeetha Sahu: ఒడిషాలో గంజాయి డాన్ సంగీత సాహు అరెస్ట్ - అబ్బో ఈమె కళాపోషణ చూసి తరించాల్సిందే !
ఒడిషాలో గంజాయి డాన్ సంగీత సాహు అరెస్ట్ - అబ్బో ఈమె కళాపోషణ చూసి తరించాల్సిందే !
New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
Embed widget