అన్వేషించండి

Indian 3 Update: ‘భారతీయుడు 2’ మూవీకి వెళ్తున్నారా? సినిమా ఎండింగ్‌లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన శంకర్, అది ఇదే!

Indian 3 Update: క‌మ‌ల్ హాస‌న్‌ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భార‌తీయుడు 2’. తాజాగా దర్శకుడు శంకర్ 'ఇండియన్ 3' గురించి ఓ స్పెషల్ అప్‌డేట్‌ ఇచ్చారు.

Indian 3 Update: యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2'. 'జీరో టోలరెన్స్' దీనికి ట్యాగ్ లైన్. ‘భార‌తీయుడు 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ షణ్ముగం తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చిత్ర బృందం దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొచ్చిలో జరిగిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు శంకర్ 'ఇండియన్ 3' గురించి ఓ స్పెషల్ అప్‌డేట్‌ అందించారు.

‘భార‌తీయుడు 2’ సినిమాకు కొనసాగింపుగా ‘భార‌తీయుడు 3’ కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌లో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. తనకు సెకండ్ పార్ట్ కంటే మూడో భాగం బాగా నచ్చిందని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా శంకర్ మాట్లాడుతూ 'ఇండియన్ 2' ఎండ్ క్రెడిట్స్‌లో పార్ట్-3 ట్రైలర్‌‌ను జత చేస్తున్నట్లుగా వెల్లడించారు. 'ఇండియన్ 3' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయితే, 6 నెలల్లోనే సీక్వెల్ విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. 

'ఇండియన్ 2' చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రేపు శుక్రవారం (జులై 12) గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‌, చెన్నైలలో ఈ సినిమాని ప్రమోట్ చేసిన చిత్ర బృందం.. మలయాళంలో సినిమాను ప్రమోట్‌ చేసేందుకు కొచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో 'ఇండియన్ 3' విడుదల గురించి శంకర్ మాట్లాడుతూ.. ''వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తయి అంతా సవ్యంగా జరిగితే ఆరు నెలల్లోనే సాధ్యమవుతుంది. మీకు అదనంగా మరో సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను.. మీరు 'ఇండియన్ 2' చివర్లో మూడో భాగం ట్రైలర్‌ను చూడొచ్చు" అని అన్నారు. 

దాదాపు 28 ఏళ్ళ కిందట కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా 'భారతీయుడు 2' తెరకెక్కింది. అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా పోరాడే ఓల్డ్ మ్యాన్ సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మరోసారి సందడి చేయబోతున్నారు. ఇందులో బొమ్మరిల్లు సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని, బ్రహ్మానందం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, కాళిదాస్ జయరామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దివంగత నెదురుమూడి వేణు, వివేక్ లను టెక్నాలజీ సాయంతో తిరిగి తీసుకొచ్చారు. 

ఇప్పటికే రిలీజైన 'భారతీయుడు 2' టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం సమకూర్చారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌ గా, టి.ముత్తురాజ్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. బి.జ‌య‌ మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌ కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. మరి సేనాపతి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.

Also Read: ఫుల్ స్పీడ్‌లో టాలీవుడ్ యంగ్ హీరోలు - ఒక్కొక్కరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget