అన్వేషించండి

Tollywood Young Heroes: ఫుల్ స్పీడ్‌లో టాలీవుడ్ యంగ్ హీరోలు - ఒక్కొక్కరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

Tollywood Young Heroes: టాలీవుడ్ యువ హీరోలందరూ బిజీగా ఉన్నారు. తమ మార్కెట్ కు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన హీరోలు నటిస్తున్న సినిమాలు, కమిటైన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

Tollywood Young Heroes Upcoming Movies: ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలంతా ఎన్నడూ లేనంత ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే, మరో చిత్రాన్ని లైన్ పెడుతున్నారు. నాని, నాగచైతన్య వంటి టైర్-2 హీరోల దగ్గర నుంచి.. అడివి శేష్, సిద్ధూ జొన్నలగ్గడ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ వరకూ అందరూ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

⦿ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'హిట్ 3' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇదే క్రమంలో 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా ప్రారంభిస్తారు. టీజె జ్ఞానవేల్, శేఖర్ కమ్ముల లాంటి మరో ఇద్దరు దర్శకులతో నాని ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. 

⦿ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'తండేల్' సినిమా పనుల్లో ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు, 'మజిలీ' దర్శకుడు శివ నిర్వాణలతో చైతూ వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. 

⦿ 'ఫ్యామిలీ స్టార్'తో ప్లాప్ అందుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD 12' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మరో రెండు చిత్రాలను ప్రకటించారు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో 'SVC 59'.. టాక్సీవాలా రాహుల్ సాంకృత్యన్ తో 'VD 14' సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. 

⦿ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఏడాదిలో ఇప్పటికే 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాలతో అలరించారు. ఇప్పుడు 'లైలా' గా లేడీ గెటప్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అలానే 'మెకానిక్ రాకీ' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇదే క్రమంలో విశ్వక్ స్వీయ దర్శకత్వంలో 'ఫలక్ నుమా దాస్' సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందని టాక్. 

⦿ ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఇది 'ఇస్మార్ట్ శంకర్' కు సీక్వెల్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. దీని తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి. మహేష్ బాబుతో రామ్ ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. 

⦿ యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో 'రాబిన్‌ హుడ్' సినిమా చేస్తున్నారు. ఇది డిసెంబర్ లో విడుదల కానుంది. అలానే వేణు శ్రీరామ్ తో కలిసి 'తమ్ముడు' అనే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు నితిన్. ఇప్పటికే 'హను-మాన్' ప్రొడ్యూసర్స్ తో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. దీన్ని విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తారని టాక్. 

⦿ ఇటీవల 'మనమే' మూవీతో నిరాశ పరిచిన టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్.. ప్రస్తుతం 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే 'లూసర్' వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యారు. 

⦿ యూత్ కింగ్ అఖిల్ అక్కినేని సైతం కొత్త కబురు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ తో 'Akhil 6' సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు. దీని తర్వాత 'వినరో భాగ్యము విష్ణుకథ' దర్శకుడు మురళీ కిషోర్ తో ఓ రూరల్ డ్రామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. 

⦿ 'టిల్లు స్క్వేర్'తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోనను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ 'తెలుసు కదా' మూవీ చేస్తున్నారు. అలానే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' చిత్రంలో నటిస్తున్నారు. వీటి తర్వాత 'టిల్లు క్యూబ్' సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. 

⦿ ఏడాదిన్నరగా బిగ్ స్క్రీన్ మీద కనిపించని అడివి శేష్.. ఇప్పుడు 'గూఢచారి 2' సినిమాని సిద్ధం చేస్తున్నారు. ఇది 'గూఢచారి' చిత్రానికి సీక్వెల్. దీంతో పాటుగా 'డెకాయిట్' అనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

⦿ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఓవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో 'రాక్షస రాజ్యం' అనే చిత్రాన్ని ప్రకటించారు. 'వెట్టయాన్' చిత్రంలో రజినీకాంత్ తో కలిసి నటిస్తున్నారు. అలానే 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్ చేసేస్తున్నారు. 

⦿ 'ఆపరేషన్ వాలెంటైన్'తో డిజాస్టర్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. కరుణ కుమార్ డైరెక్షన్ లో 'మట్కా' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇదే క్రమంలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ.. విక్రమ్ సిరికొండ సినిమాలు ప్రారంభిస్తారు. 
 
⦿ నిఖిల్ ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో 'స్వయంభూ' అనే భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ మధ్యనే రామ్ వంశీ కృష్ణతో 'ది ఇండియన్ హౌస్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలుపెట్టారు. 

⦿ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే రోహిత్ అనే కొత్త దర్శకుడితో 'SDT 18' సినిమాని ప్రకటించారు. అంతకముందు సంపత్ నందితో 'గంజా శంకర్' చిత్రాన్ని అనౌన్స్ చేసారు. 

⦿ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర కాంబినేషన్ లో 'టైసన్ నాయుడు' సినిమా తెరకెక్కుతోంది. అలానే లుధీర్ దర్శకత్వంలో 'వాహన'.. కౌశిక్ అనే డైరెక్టర్ తో సినిమా కోసం వర్క్ చేయనున్నారు. 

Also Read: క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన అఖిల్ అక్కినేని - హోమ్ బ్యానర్‌లో 'AKHIL 7' - డైరెక్టర్ ఎవరంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget