Prakramam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోదారి యువకుడి 'పరాక్రమం' - ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచో తెలుసా?
Parakramam OTT Platform: గతేడాది ఆగస్టులో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం' మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ నెల 13 నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.

Bandi Saroj Kumar's Parakramam Movie OTT Release On ETV Win: ఈ సమ్మర్‌లో పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్' (ETV Win). ఎక్స్‌క్లూజివ్ సినిమాలతో పాటు థియేటర్లలో సందడి చేసి మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలను సైతం స్ట్రీమింగ్ చేస్తోంది. గతేడాది ఆగస్టులో విడుదలైన బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం' (Parakramam) మూవీని ఈ నెల 13 నుంచి 'ఈటీవీ విన్'లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. 'ధైర్యానికి అవధులు లేవు. ఓ కలను నెరవేర్చుకోవడానికి అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న లోవరాజు జర్నీ వీక్షించండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గోదారి జిల్లాలోని లంపకలోవ గ్రామంలో పుట్టిన ఓ యువకుడి కథే 'పరాక్రమం'. సదరు యువకుని జీవితంలో గల్లీ క్రికెట్ దగ్గర నుంచీ లవ్, నాటకాలు, పాలిటిక్స్ వంటి అంశాలతో జరిగిన పరిణామాలను మూవీలో చూపించారు. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూనే.. స్వీయ దర్శకత్వం వహించిన ఈ మూవీని యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.
Courage Knows No Limits! 🔥
— ETV Win (@etvwin) March 9, 2025
The powerful tale of Parakramam is coming to @ETVWin on March 13! 💥
Witness Lovaraju’s journey as he fights against all odds to fulfill a dream. 🎭✨
📅 Streaming from March 13#ParakramamOnETVWin#Parakramam @publicstar_bsk#Etvwin pic.twitter.com/O435lvFq2m
స్టోరీ ఏంటంటే..?
తూ.గో జిల్లా లంపకలోవ గ్రామంలో సత్తిబాబు ఊర్లో నాటకాలు వేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఓసారి యుముడి వేషం వేయగా ఆ ఊరి మునసబు అది వెయ్యొద్దంటూ వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైన సత్తిబాబు.. తన కుమారుడు లోవరాజును ఎప్పటికైనా 'పరాక్రమం' అనే నాటకం వేయాలని కోరతాడు. అన్నింటికీ పూర్తిగా సిద్ధమైన తర్వాత తాను ఇచ్చిన పెట్టెను ఓపెన్ చేయాలని చెప్పి చనిపోతాడు. అయితే, లోవరాజుకు క్రికెట్ అంటే ఇష్టం. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ నాటకం ప్రదర్శించాలని ప్రయత్నిస్తాడు. అసలు ఈ నాటకం వెనుక కథేంటి..?, ఊరిలో లవ్, గల్లీ క్రికెట్‌ను దాటి లోవరాజు హైదరాబాద్ ఎలా వచ్చాడు..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అయితే, నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం వంటి బోల్డ్ సినిమాలను నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసి బండి సరోజ్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటారు. తొలిసారిగా 'పరాక్రమం' మూవీతో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి మెప్పించారు.
ఈ సినిమాతో పాటు ఈ సమ్మర్‌లో మరిన్ని మూవీస్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అందుబాటులోకి తెస్తోంది. 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ 'జితేందర్ రెడ్డి'. రాకేశ్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read: చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?





















