IIFA Digital Awards 2025: అట్టహాసంగా 'ఐఫా' ఓటీటీ అవార్డ్స్ 2025 వేడుక - పురస్కారాలు అందుకున్నది వీరే..
IIFA Awards 2025: 'ఐఫా' అవార్డ్స్ 2025 వేడుక జైపూర్ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు ఈవెంట్ జరగనుండగా.. ఓటీటీల్లో విశేష ఆదరణ పొందిన మూవీస్, సిరీస్‌లకు అవార్డ్స్ అందజేశారు.

IIFA Digital Awards 2025 Winners List: భారతీయ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక 'ఐఫా' అవార్డుల వేడుక పింక్ సిటీ జైపూర్‌లో ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు ఈవెంట్ జరగనుండగా.. తొలి రోజు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారితో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతిసనన్, శ్రేయాఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్, కరీనా కపూర్ సందడి చేశారు. శనివారం రాత్రి జరిగిన సంబరాల్లో 'ఐఫా' డిజిటల్ అవార్డులను (IIFA Digital Awards 2025) ప్రధానం చేశారు. ఓటీటీల్లో మంచి ఆదరణ సొంతం చేసుకున్న మూవీస్, సిరీస్‌లకు అవార్డులు అందజేశారు. ఓటీటీ సినిమాలకు సంబంధించి ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సే (Vikrant Massey), ఉత్తమ నటిగా కృతిసనన్ (Kritisanon) పురస్కారాలు అందుకున్నారు. ఇలాంటి అవార్డులు యాక్టర్స్‌లో వృత్తిపట్ల మరింత పట్టుదల పెంచుతాయన్నారు. ఆదివారం సాయంత్రం జరగనున్న వేడుకలో చిత్ర రంగానికి సంబంధించిన అవార్డులు అందజేస్తారు.
🏆✨ IIFA Digital Awards 2025 honored the best of Indian OTT!
— Sonja Dewing (@LezetoMedia) March 9, 2025
🎬 Best Film: Amar Singh Chamkila
📺 Best Series: Panchayat S3
👑 Best Actor: Vikrant Massey (Sector 36)
🌟 Best Actress: Kriti Sanon (Do Patti)
OTT is ruling entertainment! Which was your favorite? 🎥🍿… pic.twitter.com/FUcXLHuE7R
Also Read: వైజయంతి కొడుకు అర్జున్‌గా నందమూరి కళ్యాణ్ రామ్... ఫిరోషియస్ లుక్స్, ఇంటెన్స్ పోస్టర్
విజేతల జాబితా ఇదే..
- ఉత్తమ చిత్రం - అమర్ సింగ్ చంకీలా
- ఉత్తమ నటుడు - విక్రాంత్ మస్సే (సెక్టార్ 36)
- ఉత్తమ నటి - కృతి సనన్ (దో పత్తి)
- ఉత్తమ స్టోరీ - కనికా ధిల్లాన్ (దో పత్తి)
- ఉత్తమ డైరెక్టర్ - ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
- ఉత్తమ సహాయ నటుడు - దీపక్ (సెక్టార్ 36)
- ఉత్తమ సహాయ నటి - అనుప్రియా గోయెంకా (బెర్లిన్)
- ఉత్తమ సిరీస్ - పంచాయత్ సీజన్ 3
- ఉత్తమ నటుడు - జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)
- ఉత్తమ నటి - శ్రేయాచౌదరి (బందీశ్ బందిట్స్ సీజన్ 2)
- ఉత్తమ దర్శకుడు - దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)
- ఉత్తమ సహాయ నటుడు - ఫైజల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
- ఉత్తమ సహాయ నటి - సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)
- ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ - యో యో హనీ సింగ్: ఫేమస్
- ఉత్తమ రియాల్టీ సిరీస్ - ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్
మరోవైపు, ఈ అవార్డుల వేడుకలో చాలా మంది నటీమణులు 'ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా' పేరుతో జరిగిన చర్చలో తమ వాయిస్ వినిపించారు. హీరోల్లాగే తాము కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తున్నామని.. అయితే రెమ్యునరేషన్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటోందని అన్నారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Also Read: చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?




















