అన్వేషించండి

SLBC Rescue Operations: కేరళ జాగిలాల రాకతోనే ఎస్​ఎల్​బీసీ ఆపరేషన్‌లో కీలక ముందడుగు- ఏం జరిగిదంటే?

SLBC Tunnel:ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గల్లంతైన వారి జాడను జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం.

SLBC Rescue Operations: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే సొరంగంలో గల్లంతైన వారి జాడను జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే గల్లంతైన వారిలో కొందరిని నేటి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుని 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కోసం రెస్క్యూ చర్యలు సాగుతున్నాయి. ఇందుకోసం 15 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. NDRF, SDRF, NGRI,  Singareni, Rat Hole Mines, Hydra వంటి సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మనుషులు చిక్కుకున్న ప్రదేశం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోవడంతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్- NDMA కేరళ  SDRFను  కెడవర్ డాగ్స్​ సాయం తీసుకుంటున్నారు.

Also Read: పరీక్ష కేంద్రాల్లో 'గోడ గడియారాలు' పెట్టాల్సిందే, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

కడావర్​ డాగ్స్​ గుర్తించిన డీ2 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన కార్మికులకు శనివారం ఓ వ్యక్తి కుడి చేయి కనిపించింది. అప్రమత్తమైన కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు దాని చుట్టూ రెండు అడుగుల మేర మరో ఆరడుగుల లోతులో గొయ్యి తవ్వేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో మరో డెడ్​బాడీ ఉండవచ్చని భావిస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించడానికి తవ్వుతున్న ఈ టన్నెల్‌లో 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 15 కొనసాగుతున్న సహాయక చర్యలు ఇక చివరి దశకు చేరుకున్నట్లే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కన్వేయర్ బెల్టు సాయంతో శిథిలాల నుంచి మట్టి, బురదను బయటకు పంపిస్తున్నారు. రోబోటిక్ మిషనరీ బృందాలు కూడా టన్నెల్ లోపల కార్మికులను వెతికే పనిలో ఉన్నాయి. మట్టి, శిథిలాల్లో కూరుకుపోయిన వారిని నేడు, రేపు వెలికితీసే అవకాశాలున్నాయి.

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు డ్రైవర్ల మృతి, 10 మందికి గాయాలు

టాప్ హెడ్ లైన్స్

Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ- గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ- గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget