అన్వేషించండి

Dhruv Sarja: దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్

Martin Telugu Pre Release Event: కన్నడ హీరో ధృవ్ సర్జా తాజాగా జరిగిన 'మార్టిన్' అనే పాన్ ఇండియా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడి, అందరినీ ఫిదా చేశారు.

కన్నడ హీరో ధృవ్ సర్జా (Dhruva Sarja) హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'మార్టిన్'. ఏపీ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వాసవి ఎంటర్ప్రైజెస్, ఉదయ్ కే మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఉదయ్ మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా... మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని అక్టోబర్ 11న పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం చిత్ర బృందం హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో ధృవ్ సర్జా చేసిన రిక్వెస్ట్ అందరిని ఆకట్టుకుంది. మరి ఆయన ఏమన్నారో తెలుసుకుందాం పదండి. 

ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ 
ఒకప్పుడు టాలీవుడ్ ను తన సినిమాలతో ఊపేసిన యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా పాన్ ఇండియా మూవీ 'మార్టిన్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయన తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులకు వినమ్రంగా రిక్వెస్ట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ధృవ్ సర్జా మాట్లాడుతూ "నేను చాలా హానెస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. బయట టాలెంట్ ఉన్న చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అన్న విషయం నాకు తెలుసు. దయచేసి నా సినిమాను అక్టోబర్ 11న చూడండి. ఒకవేళ నేను టాలెంటెడ్ కాదు అని మీకు గనక అనిపిస్తే నన్ను నెక్స్ట్ మూవీ నుంచి ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ నాకు టాలెంట్ ఉంది, ఈ సినిమాకు నేను న్యాయం చేశాను అనిపిస్తే... ప్లీజ్ దయచేసి ఒక హెల్ప్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో నా మూవీకి వెళ్ళండి. నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఈ సినిమాలో 100% నా బెస్ట్ ఇచ్చాను. రెండున్నర ఏళ్ళు నా టీంతో సహా నేను కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. దయచేసి అక్టోబర్ 11న సినిమాను చూసి నన్ను ఆశీర్వదించండి. అన్ని సినిమాలు చూడండి... టైం ఉంటే నా సినిమాను కూడా చూసి ఆశీర్వదించండి' అంటూ చాలా వినయంగా తెలుగు ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేశాడు. ఆయన స్పీచ్ ను చూస్తే ధృవ్ సర్జా అడిగిన విధానానికైనా ఫిదా అవ్వడం ఖాయం. అంతే కాదు ఓసారి ఈ సినిమాను చూడొచ్చు అనిపిస్తోంది. కానీ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ హీరోకి ప్రేక్షకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అన్నది చూడాలి.

Read Also : Prakash Raj - Pawan Kalyan: మీరు సనాతన ధర్మ రక్షణలో... మేము సమాజ రక్షణలో - పవన్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు

'మార్టిన్' వివాదం 
'మార్టిన్' మూవీ మొదలయ్యి ఇప్పటికే ఐదారు ఏళ్లు కావస్తోంది. ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. చిత్ర దర్శకుడు ఏపీ అర్జున్ స్వయంగా తన సినిమా 'మార్టిన్' రిలీజ్ ను ఆపాలంటూ హైకోర్టులో కేసు వేశారు. మరోవైపు నిర్మాత ఉదయ్ మెహతా ఈ సినిమా బడ్జెట్ కోసం డబ్బులు దుర్వినియోగం చేశారంటూ, సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ సంస్థపై ఛీటింగ్ కేసు దాఖలు చేయగా, అందులో డైరెక్టర్ అర్జున్ పేరు కూడా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన మూవీ పోస్టర్లలో డైరెక్టర్ పేరు కనిపించకపోవడంతో 'తన పేరు, అనుమతి లేకుండానే రిలీజ్ కు సిద్ధమైన 'మార్టిన్' రిలీజ్ ను ఆపాలంటూ తాజాగా డైరెక్టర్ అర్జున్ కోర్టును ఆశ్రయించారు. మరి నిర్మాత, డైరెక్టర్ మధ్య జరుగుతున్న ఈ వివాదం నేపథ్యంలో సినిమా రిలీజ్ సజావుగా సాగుతుందా ? అనేది చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kanguva Movie: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
Kadiyam Srihari: వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
Free Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
Embed widget