అన్వేషించండి

Kashmir Tourist Spots: మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం, కశ్మీర్‌లో సగానికి పైగా టూరిస్టు కేంద్రాల మూసివేత

Pahalgam Terror attack | జమ్మూకాశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి తరువాత సైతం మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.

Tourist Spots closed in Jammu and Kashmir | శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని సగానికి పైగా పర్యాటక స్థలాలను మూసివేసింది. మరికొన్ని పర్యాటక స్థలాల వద్ద భద్రత పెంచింది. కాశ్మీర్ వ్యాప్తంగా 87 టూరిస్టు కేంద్రాలు ఉండగా 48 నుంచి 50 వరకు పర్యాటక స్థలాలను మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోన్ మార్గ్, దాల్ లేక్, గుల్మార్గ్, బైసారన్ లోయ సహా సున్నితమైన పర్యాటక కేంద్రాలలో ప్రత్యేక భద్రత దళాలు ఏర్పాటు చేశారు.

భద్రతపై సమీక్షిస్తున్న అధికారులు

పర్యాటకులు ప్రవేశించడానికి అనుమతించని టూరిస్ట్ ప్రదేశాలలో గురేజ్ లోయ, దూద్‌పత్రి ఉన్నాయి. గత వారం 'మినీ స్విట్జర్లాండ్'గా పిలుచుకునే బైసరన్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లోయలో అతిపెద్ద దాడి ఇది. పర్యాటకులకు ముప్పు ఉందని, మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భావించి కాశ్మీర్‌లోని 87 పబ్లిక్ పార్కులు, ప్రదేశాలలో 48 చోట్ల గేట్లు మూసివేశారు. భద్రతా సమీక్ష కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో జాబితాలో మరిన్ని ప్రదేశాలను మూసివేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని PTI తెలిపింది.

మూసివేసిన పర్యాటక ప్రదేశాలు కాశ్మీర్‌లోని సుదూర ప్రాంతాలలో ఉన్నాయని, గత పదేళ్లలలో తెరుచుకున్న కొత్త టూరిస్ట్ స్పాట్స్ కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులు సందర్శించలేని ప్రదేశాలలో కోకెర్నాగ్, దుక్సమ్, మార్గన్ టాప్, సింథాన్ టాప్, అచ్చబల్, బాంగస్ లోయ, తోసామైడాన్ ఉన్నాయి.

దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఉగ్రదాడికి సంబంధించి రోజుకో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల ఆధారంగా, ఆ వీడియో తీసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు ఆ సమమయంలో ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులను విచారించడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన బైసరస్ లోయ ప్రదేశంలో ఐఎన్ఐఏ అధికారులు సీన్‌ రీక్రియేట్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో బైసరన్ లోయను సందర్శించిన వారిని ప్రశ్నించి ఉగ్రదాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Delhi AQI: దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీ ప్రజలు విషగాలులు పీల్చుతున్నారా ? గ్యాస్ చాంబర్‌గా మారిన సిటీ
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీ ప్రజలు విషగాలులు పీల్చుతున్నారా ? గ్యాస్ చాంబర్‌గా మారిన సిటీ
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Embed widget