టీనేజ్ అమ్మాయిలు, యంగ్ లేడీస్ ఎటువంటి చీరలు కట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఒక్కసారి రీతూ చౌదరిని చూడండి ప్రతి అమ్మాయి డ్రసింగ్ కలెక్షన్ లో తప్పకుండా ఉండాల్సినది బ్లాక్ కలర్ శారీ. నల్లచీరలో అమ్మాయిలు అదుర్స్ అంతే! వైట్ కలర్ శారీస్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఏ సందర్భానికి అయినా చక్కగా సరిపోతాయి. దేవకన్య ఫీలింగ్ ఇస్తాయి. చిన్న అంచు ఉన్న ప్లెయిన్ కలర్ శారీకి, ఆ అంచు రంగు బ్లౌజ్ వేస్తే ట్రెండీగా ఉంటుంది. ఫ్యాన్సీ నెట్ శారీస్, షిఫాన్ ప్రింట్ శారీస్ యంగ్ గాళ్స్ కు మరింత బావుంటాయి. లంగా వోణీలు... అందులో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అయితే కేక అంతే! ఇంట్లో పూజ ఉన్నప్పుడు లేదంటే గుడికి వెళ్ళేటప్పుడు గోల్డెన్ లేదా ఎల్లో కలర్ శారీస్ పర్ఫెక్ట్ ఆప్షన్. సిల్క్ శారీస్, ఫ్లోరల్ డిజైన్ ఉన్నవి రెట్రో ఫీల్ ఇస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో ఇటువంటి చీరలు కట్టొచ్చు. తల్లితో రీతూ చౌదరి రీతూ చౌదరి (All Images Courtesy: rithu_chowdhary / Instagram)