అన్వేషించండి

Avakaya Pachadi Recipe : నోరూరించే ఆవకాయ పచ్చడి రెసిపీ.. ఏడాదంతా రుచిగా, పాడవకుండా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Avakaya Pachadi : ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమున్నా.. దానిని తయారు చేయడం కష్టమనుకుంటున్నారా? అయితే ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఆవకాయను ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం.

Andhra style Avakaya : వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి.. కాసింత నెయ్యి ఎవరికి నచ్చదు చెప్పండి. అదే పప్పుతో కలిపి తింటే రుచి నెక్స్ట్​ లెవెల్​లో ఉంటుంది. అందుకే దీనిని సమ్మర్​లో దాదాపు ప్రతి ఇంట్లో ఓ సాంప్రదాయంగా పడతారు. అయితే ఆవకాయ పచ్చడి పాడవకుండా.. ఏడాదంతా మంచి రుచితో ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

మామిడి కాయలు - 20 (3 కేజీల ముక్కలు)

పల్లీ నూనె - 2 లీటర్లు

కారం - అర కిలో

ఆవపిండి - 450 గ్రాములు

మెంతి పిండి - 150 గ్రాములు

పసుపు - 3 చెంచాలు

ఉప్పు - 300 గ్రాములు

వెల్లుల్లి - 150 గ్రాములు

తయారీ విధానం

ముందుగా మామిడికాయలను కడుక్కుని.. శుభ్రంగా తడిలేకుండా తుడుచుకుని పైన కాడలని కోసుకోవాలి. కాసేపు మామిడి కాయలను గాలికి ఆరనిచ్చి.. సమానమైన ఆవకాయ ముక్కలుగా కోసుకోవాలి. కాయని కోసిన తర్వాత లోపలున్న జీడి.. దానికింద ఉన్న పొర రెండూ లేకుండా తీసేయాలి. ఇలా ముక్కలన్నీ చేసుకున్న తర్వాత.. మరోసారి ముక్కలు తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. వీటిని కాసేపు ఆరబెట్టుకోవాలి. దీనివల్ల తడిపోతుంది. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది కాబట్టి.. ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 

ఆరబెట్టుకున్న ముక్కలను ఓ గిన్నెలో తీసుకుని.. దానిలో లీటర్ నూనె వేసుకుని కలుపుకోవాలి. దీనివల్ల ముక్క ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది. అయితే పచ్చడి పట్టుకునే ముందు రోజు నుంచే ఆవాలు, మెంతులు, ఉప్పు లేదా సాల్ట్ విడివిడిగా ఆరబెట్టుకోవాలి. పచ్చడి పట్టుకునే రోజు వాటిని పౌడర్​గా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా పైన పొట్టు తీసుకోవాలి. పచ్చడి పట్టుకునే ముందే వీటిని తీసుకుంటే వెల్లుల్లి అరోమా కూడా పచ్చడికి వచ్చి మంచి రుచి వస్తుంది. 

ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని దానిలో మామిడి ముక్కలు వేసుకోవాలి. దానిలో ఎలాంటి మసాల లేని పచ్చి కారం.. ఆవ పిండి, మెంతి పిండి వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లి వేసుకుని బాగా కలపాలి. మిగిలిన నూనె కూడా వేసి ముక్కలకు అన్ని బాగా కలిసేలా, పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఆవకాయను ఓ గాలి చేరని కంటైనర్​లో లేదా జాడీలో స్టోర్ చేసుకోవాలి. మూత గట్టిగా పెట్టాలి. 

ప్రతి రోజూ ఉదయం తడి చేతులు లేకుండా, గరిట తడిలేకుండా చూసుకుని పచ్చడిని కలుపుకోవాలి. మొదటి రోజు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తగినంత తలుపుకోవాలి. పచ్చడి ముక్క నూనెలో ఉండేలా చూసుకోవాలి. ఇలా మూడు రోజులు కలిపిన తర్వాత దానిని ఇంక కలపాల్సిన అవసరం లేదు. పచ్చడిని జాడీలోకి మార్చుకుని దానిలోకి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నిల్వ ఆవకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఈ సమ్మర్​లో టేస్టీ ఆవకాయ పచ్చడిని పట్టేసుకోండి. ఏడాదంతా ఎంజాయ్ చేయండి. చెప్పిన జాగ్రత్తలు ఫాలో అయితే పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget