అన్వేషించండి

Sowmya Janu: రోడ్డుపై నటి రచ్చ - హోమ్ గార్డును బూతులు తిడుతూ వీరంగం

Sowmya Janu: పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సౌమ్య జాను.. తాజాగా బంజారా హిల్స్ రోడ్డుపై వీరంగం సృష్టించింది. రాంగ్ రూటులో రావడం మాత్రమే కాకుండా హోమ్ గార్డ్‌పై విరుచుకుపడింది.

Sowmya Janu: ట్రాఫిక్ పోలీసుల దగ్గర సెలబ్రిటీలు రచ్చ చేయడం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా మరో నటి కూడా తాను తప్పు చేసిందే కాకుండా పోలీసులపై సీరియస్ అయ్యింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంలో తన తప్పు ఏం లేదని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చింది నటి. తనే సౌమ్య జాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలతో, సినిమా, సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది సౌమ్య. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్లపై సౌమ్య చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసభ్యంగా తిట్టింది..

బంజారా హిల్స్‌లో తప్పు రూటులో రావడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆపి ప్రశ్నించగా.. ఎంతమంది అలా రావడం లేదంటూ వారిపైకే సీరియస్ అయ్యింది సౌమ్య. ఫిబ్రవరీ 24న జాగ్వార్ కారులో బంజారా హిల్స్ వైపు డ్రైవ్ చేస్తూ వచ్చింది సౌమ్య జాను. అక్కడ రాంగ్ రూటులో వెళ్తున్న తనను ఆపి ప్రశ్నించిన ట్రాఫిక్ హోమ్ గార్డుపైనే విరుచుకుపడింది. రాంగ్ రూటులో డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్న హోమ్ గార్డును అసభ్యంగా తిట్టడంతో పాటు తనపై సౌమ్య చేయి కూడా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తను ఒక సెలబ్రిటీ కావడంతో హోమ్ గార్డ్‌తో సౌమ్య గొడవపడుతున్న వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు నెటిజన్లు.

కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి..?

ఇక ఈ ఘటన జరిగిన రెండురోజుల తర్వాత ఈ విషయంపై మాట్లాడడానికి సౌమ్య.. మీడియా ముందుకు వచ్చింది. రాంగ్ రూటులో వెళ్లడం తప్పు అని ఒప్పుకోకుండా తాను ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నానని తనను తాను సమర్ధించుకుంది. ఒక సెలబ్రిటీగా తనకే ఇలా జరిగితే.. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అంటూ చట్టాన్ని కించపరిచినట్టుగా మాట్లాడింది. అంతే కాకుండా తప్పు తనేది అయినా కూడా తనను ఆపిన హోమ్ గార్డ్‌పై కేసు నమోదు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ తనను పోలీసులు ప్రశ్నించడానికి పిలవలేదని బయటపెట్టింది. రాంగ్ రూటులో సౌమ్య వెళ్లిన వీడియో మాత్రమే కాకుండా తన ఇంటర్వ్యూ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తప్పు చేసి కూడా ఇలా తనను తాను సమర్ధించుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు తనపై విమర్శలు కురిపిస్తున్నారు.

మొదటిసారి కాదు..

సౌమ్య జాను పేరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. చాలా సినిమాల్లో హీరోలకు చెల్లెలిగా, హీరోయిన్స్‌కు ఫ్రెండ్‌గా నటించి మెప్పించింది సౌమ్య. అయితే ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వల్ల తను ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కున్నానని చెప్పి షాకిచ్చింది. అంతే కాకుండా శ్రీ రెడ్డి తరహాలోనే తను కూడా దగ్గుబాటి అభిరామ్‌పై ఆరోపణలు చేసింది. అభిరామ్ తనను ఏడిపించాడని, తన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రాంగ్ రూటులో రావడం మాత్రమే కాకుండా రోడ్డుపై రచ్చ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

Also Read: కాబోయే భర్త 'VD' లాగా ఉండాలన్న రష్మిక - పరోక్షంగా హింట్ ఇచ్చిందంటున్న ఫ్యాన్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
Vijay Deverakonda Rashmika: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
Embed widget