Tamannah Bhatia: స్కూల్ పుస్తకాల్లో పాఠంగా తమన్నా జీవిత కథ - మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బోర్డుకు ఫిర్యాదు
Hebbal Sindhi School: స్కూల్ బుక్స్‌లో విద్యార్థులకు పాఠంగా తమన్నా జీవిత చరిత్రను చేర్చడంపై విద్యార్థు తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. దీనిపై ప్రైమరీ స్కూల్ బోర్డు కూడా సీరియస్ అయింది.
Tamannaah Bhatia in Controversy: విద్యార్థులకు పాఠంగా తమన్నా జీవిత చరిత్రలో పాఠ్యాపుస్తకాల్లో చేర్చడం ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. తమన్నా జీవిత చరిత్రను పిల్లలకు పాఠంగా చెప్పడమేంటని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు తమన్నా జీవిత చరిత్రను పుస్తకాల నుంచి తొలగించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకి అసలు విషయం ఏంటంటే.. బెంగళూరులోని హెబ్బళ సింధీ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యా పుస్తకాల్లో తమన్నా, రణ్‌వీర్ సింగ్ జీవిత చరిత్రను పాఠంగా చేర్చారు. సింధీ వర్గానికి చెందని వీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు.. ఆ తర్వాత పాన్ ఇండియన్ లెవెల్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణ్‌వీర్‌సింగ్, తమన్నా జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందట. అందుకే ఈ ఏడాది కొత్త పాఠ్యపుస్తకాల్లో తమన్నాతో పాటు రణ్‌వీర్‌సింగ్ సినీ ప్రయాణం, నటులుగా వారు సాధించిన విజయాలు, అవార్డులను ఆవిష్కరిస్తూ పాఠ్యాంశాలను చేర్చింది స్కూల్ మేనేజ్‌మెంట్.
అయితే తమన్నా జీవిత కథను పాఠంగా చేర్చడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. అంతేకాదు దీనిపై విద్యా సంఘాలు కూడా వ్యతిరేకత తెలుపుతున్నాయి. దీనిపై చిల్డ్రన్ రైట్స్ కమీషన్‌తో పాటు కర్ణాటక ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ బోర్డ్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫిర్యాదు పేర్కొన్న కారణాలు ఇలా ఉన్నాయి. సింధీ వర్గం నుంచి గొప్పగా స్థాయికి వెళ్లిన కళాకారుల జీవితాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ.. తమన్నా గురించి జీవిత చరిత్ర కాకుండ మరే సీనియర్ నటీనటుల జీవితాన్ని సిలబస్ చేర్చితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలా తమన్నా బయోగ్రఫిని చేర్చడం వల్ల పాఠాల్లో ఒకటి ఉంటే ఇంటర్నేట్‌లో ఆమె ఫోటోలు మరోలా ఉంటాయని.. వాటి నుంచి పిల్లలు ఏం స్ఫూర్తి పొందుతారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు దీనివల్ల పిల్లలు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఓ విద్యార్థి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. నటిగా తమన్నాను గౌరవిస్తామని, కానీ పిల్లలకు ఓ పాఠంగా స్పూర్తి పోందేలా ఆమె జీవిత చరిత్ర లేదని కొందరు పేరెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారట.
తమన్నా జీవితం నుంచి ఏడో తరగతి విద్యార్థులు ఏ విధంగానూ స్ఫూర్తి పొందలేరని, వారికి ఆమె పాఠం ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోల్డ్, సెమీ న్యూడ్ రోల్స్ చేసే వారి జీవిత పాఠాలను స్కూల్ బుక్స్ చేర్చడం కరెక్ట్ కాదంటూ స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫిర్యాదును పరిశీలిచించిన కర్ణాటక ప్రైమరీ సెకండరీ స్కూల్ బోర్డ్ స్కూల్ యాజమాన్యంపై మండిపడినట్టు సమాచారం. తమ అనుమతి లేకుండా తమన్నా జీవిత చరిత్రను పాఠంగా చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. వెంటనే తమన్నా జీవిత కథను సిలబస్ నుంచి తీసేయాలని స్కూల్ యాజమాన్యానికి సూచించినట్టు తెలుస్తోంది.