Asaduddin Owaisi Attack: 'మీరు ఒక్క ఓవైసీని చంపితే లక్షలాది మంది ఓవైసీలు పుడతారు'
ఒక్క ఓవైసీని చంపితే లక్షలాది మంది ఓవైసీలు పుడతారని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. తనపై జరిగిన దాడి గురించి ఎన్నికల ప్రచారంలో మరోసారి మాట్లాడారు.
మహాత్మా గాంధీని చంపిన వారే తనపై హత్యా యత్నం చేశారని ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ అసారా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఓవైసీ వ్యాఖ్యానించారు.
బాఘ్‌పట్ జిల్లాలోని ఛప్రౌలీ నియోజకవర్గంలో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థి తరఫున ఓవైసీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
మోసం చేస్తున్నారు..
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మైనార్టీలను మోసం చేస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక ఇచ్చిన వాగ్దానాలను అఖిలేశ్ నెరవేర్చరన్నారు.
అసదుద్దీన్ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.
Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా లక్ష 7 వేల కేసులు నమోదు