అన్వేషించండి
AP, Telangana Union Ministers: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేశారో తెలుసా!
PM Modi Oath Taking Ceremony: ప్రధాని మోదీతో పాటు 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస వర్మలు ప్రమాణం చేశారు.

తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేశారో తెలుసా!
1/7

నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మొదటగా నరేంద్ర మోదీతో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం మిగతా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ముర్ము. ఈ వేడుక వైభవంగా నిర్వహించారు.
2/7

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
3/7

సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి హిందీ భాషలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
4/7

గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇంగ్లీషు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము టీడీపీ ఎంపీ పెమ్మసానితో కేంద్రమంత్రిగా ప్రమాణం చేయించారు.
5/7

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేశాక ప్రధాని మోదీ వద్దకు వెళ్లగా.. ఆయన బండి సంజయ్ భుజం తట్టారు.
6/7

బీజేపీ నేత, నరసాపురం ఎంపీగా గెలిచిన శ్రీనివాస్ వర్మ సైతం హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు.
7/7

Narendra Modi Cabinet Group Photo: ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్ర మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను కేంద్ర మంత్రి అమిత్ షా షేర్ చేశారు.
Published at : 10 Jun 2024 12:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion