అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Pawan Kalyan: ఎన్నికల్లో నెగ్గాక పెద్ద ఊరేగింపు చేయాలన్నారు, కానీ మంచి పని కోసం వెయిట్ చేశా: పవన్ కళ్యాణ్
AP Deputy CM Pawan Kalyan | తమది సాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పింఛన్లు పంపిణీ చేశారు.
పింఛన్లు పంపిణీ చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
1/12

వందకు వంద స్ట్రయిక్ రేటు ఇవ్వాలని కోరితే, ప్రజలు జనసేన పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను బలమైన సంకల్పంతో ఎన్నికలకు రాగా జనసేనను వంద శాతం విశ్వసించారని చెప్పారు.
2/12

100 శాతం గ్రామాలకు పూర్తిస్థాయి రక్షిత మంచినీటి పథకం అమలైన రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. ప్రతి ఇంటికి లోటు లేకుండా నీరు అందాలి. ప్రతి ఒక్కరి గొంతు తడవాలి. కాలుష్యం లేని నీళ్లు అందిస్తూ ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి అన్నదే లక్ష్యమన్నారు జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్
3/12

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఇప్పు పూర్తిగా పాలనపారమైన సవాళ్లపై ఫోకస్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసింది. వాటిని గాడిలోపెట్టేందుకు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
4/12

రూ.3 వేలు ఉన్న అవ్వాతాతల పింఛనును రూ.4 వేలు చేసి అందిస్తున్నాం. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. గత 3 నెలలకు సంబధించిన రూ.3 వేలు కలిపి ఒకేసారి రూ.7 వేలు పింఛను అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
5/12

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకి చెందిన దివ్యాంగురాలు మేడిశెట్టి నాగమణికి పవన్ కళ్యాణ్ మొదటి పింఛను స్వయంగా అందించారు. అనంతరం పెన్షనర్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
6/12

నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. విజయంతో పెద్ద ఊరేగింపు నిర్వహించాలని చాలామంది చెప్పారని.. అయితే మంచి పనితో మీ ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలనే పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు.
7/12

తాను ప్రతి నిమిషం రాష్ట్ర శ్రేయస్సు కోసం, క్షేమం కోసం పని చేస్తానని.. ఉపాధి అవకాశాలు, సాగునీటి కాలువల పూడిక తీతలు, రక్షిత మంచినీరు అందించి ప్రజలకు దగ్గర కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
8/12

పంచాయతీరాజ్ శాఖ విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటుంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయి, ఎలా దారి మళ్లించారో అంతుపట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోస్తామన్నారు.
9/12

వాలంటీర్లు లేకపోతే ఏపీలో పింఛన్ల పంపిణీ అసాధ్యమని వైసీపీ హయాంలో చెప్పారని.. నేడు వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
10/12

కొందరు వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకునేవారని, ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రంలోగా పింఛన్ల పంపిణీ పూర్తవ్వకపోతే, మరుసటి రోజు పూర్తి చేస్తామన్నారు.
11/12

రోడ్లు వేయాలని చూస్తే నిధులేవీ లేవు. ప్రజలకు ఖర్చు చేయాల్సిన ప్రతి పైసా ఎక్కడికి పోయిందో తెలియాలని అధికారులను సుదీర్ఘంగా సమీక్షలు చేసి పూర్తి వివరాలు అడుగుతున్నట్లు చెప్పారు. ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.
12/12

ఏపీలో అధికారంలో ఉన్నది సాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికితీసి ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందన్నారు.
Published at : 01 Jul 2024 03:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















