X

Interview: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలి? 

చదువు అయిపోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. కంపెనీ పెట్టే పరీక్ష బాగానే రాస్తారు. కానీ ఇంటర్వ్యూ దగ్గరే చాలా మంది ఆగిపోతారు. ఎందుకు అని ఒక్కసారి ఆలోచించారా?

FOLLOW US: 

ఇంటర్వ్యూకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా.. ఇంటర్వ్యూ పోతుంది. మళ్లీ ఇంటికొచ్చాకా.. దాని గురించే ఆలోచిస్తూ.. ఉంటారు. అదే ఇంటర్వ్యూకి వెళ్లడానికి ముందే ప్రిపేర్ అయితే.. తల నొప్పి ఉండదూ.. కాన్ఫిడెంట్ గా బయటకు రావొచ్చు. రాత పరీక్ష కంటే.. ఇంటర్వ్యూతోనే ఎక్కువ భయం. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు.. డ్రెస్, శరీర కదలికలు, ముఖ కవళికలు జాగ్రత్తగా ఉండాలి. వాటిపైనా ఆధారపడి మీరు.. జాబ్ కి సెలక్ట్ అవుతారా? లేదా అనేది ఉంటుంది. 

ఇంటర్వ్యూ అనగానే అదేదో ఫ్యాషన్ అనుకోని.. రంగురంగుల బట్టలు వేసుకుంటారు కొంతమంది. నీట్ గా డ్రెస్ ఉండాలి. ఇంటర్వ్యూయర్ ఏంట్రా బాబు.. అనుకునేలా ఉండకూడదు. ఎప్పుడైనా గమనించారా? సినిమాల్లోనూ చూసే ఉంటారు. ఇంటర్వ్యూ రూమ్ లోపలికి ప్రవేశించి... లోపలికి రావచ్చా.. అని అడుగుతారు. మీరు ఆల్ రెడీ వచ్చేశారుగా.. అని ఇంటర్వ్యూయర్ అంటే.. మీ దగ్గర సమాధానం ఏం ఉంటుంది. అందుకే చిన్నగా తలుపు తట్టి.. పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్లాలి. 

దగ్గరికి వెళ్తుంటే.. చాలా మందిలో కాళ్లు వణకడం సహజం. కానీ.. మీరు నడుస్తుంటే.. మీలోని కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూయర్ కి తెలియాలి. ఇంటర్వ్యూ చేసేవాళ్లు కూర్చోండి అని చెప్పాకనే కూర్చోండి. అనుమతి లేకుండా.. కూర్చొంటే.. మెుదటిసారే నెగెటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంది. సీటు దొరికింది కదా అని.. ఇష్టం వచ్చినట్టు కూర్చొవద్దు. చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి. టేబుల్‌ మీద పడడం, వెనుకకు వాలి కూర్చోవడం చేయోద్దు. శరీరం నిటారుగా, రిలాక్స్‌గా ఉండాలి.  
ఇంటర్వ్యూని చిరునవ్వుతో ఫేస్ చేయండి. ఇంటర్వ్యూ ప్యానల్ లోని.. అందరితో ఐ కాంటాక్ట్ ఉండేలా చూసుకోవాలి. ప్రశ్న అడిగే వాళ్ల కళ్లలోకి ప్రశాంతంగా చూస్తూ వినాలి. మీకు తెలియని ప్రశ్న అడిగారు కదా అని కోపంగా చూడకండి. మీకు తెలిసిన సమాధానం ఉంటే.. అందరివైపు చూస్తూ చెప్పాలి.

ఇంటర్వ్యూ అనేది.. మీకు సమాధానాలు తెలుసా? లేదా అనే దాని కోసం కాదు. మీకు సమాధానం తెలియకపోతే.. తెలియదు అని నేరుగా చెప్పేయండి.. మీ నిజాయితి ఏంటో అర్థమవుతుంది. అంతేగాని.. సగం సగం.. చెబుతూ పోతే.. మీ మీద ఇంప్రెషన్ పోతుంది. అంతేకాదు.. మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. 

సాధారణంగా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు మీ రెజ్యూమ్ నుంచే అడుగుతారు. మీ గురించి చెప్పండి? అంటారు. దానికి సంబంధించిన విషయాలు.. కాన్ఫిడెన్స్ గా చెప్పండి. ఒకవేళ మీరు గతంలో ఏదైనా కంపెనీలో చేసి ఉంటే.. అక్కడ మీ పని ఏంటి? అని అడుగుతారు.    ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించడానికి ముందు.. కొన్ని నిమిషాలపాటు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. గతంలో మీరు సాధించినది ఏదైనా ఉంటే... దానిని గుర్తు చేసుకోండి... పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కాస్త నీరు తాగి వెళ్లండి.

Also Read: Oxford Dictionary: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 ఏంటో తెలుసా.. మీకు బాగా తెలిసిన పదమేలే!

Also Read: CBSE Question: గుజరాత్ అల్లర్లకు ఎవరు కారణం.. ఆప్షన్స్.. కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్, రిపబ్లికన్.. పరీక్షలో సీబీఎస్ఈ ప్రశ్న

Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే.. 

Tags: Job News resume interview tips Interview Problems

సంబంధిత కథనాలు

Fact Check CBSE :  సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

Fact Check CBSE : సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!