(Source: ECI/ABP News/ABP Majha)
ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న.. అగ్రశ్రేణి సంస్థల్లో భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. అయితే అందులో దాదాపు చాలా మంది ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు.
పరాగ్ అగర్వాల్ ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను నిరూపించుకున్న మరో భారతీయుడు. జాక్ డోర్సే స్థానంలో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ యొక్క కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ట్విట్టర్‌కి సీఈవో కొత్తగా నియమితులైన పరాగ్ అగర్వాల్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వరకు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి సంస్థలకు నాయకత్వం వహిస్తున్న వారు వీళ్లే..
పరాగ్ అగర్వాల్
నవంబర్ 29న ట్విట్టర్ కొత్త CEOగా నియమితులైన పరాగ్ అగర్వాల్ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి. ముంబైలో జన్మించాడు అతడు. ఐఐటీ నుంచి 2005లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీని అభ్యసించాడు. 2011లో ట్విట్టర్‌లో చేరారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూలోనూ పని చేశారు.
సుందర్ పిచాయ్
గూగుల్ మరియు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో జన్మించారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తరువాత మెటీరియల్ సైన్స్ మరియు ఇంజినీరింగ్‌లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ చదివారు. వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ, పెన్సిల్వేనియాలో సుందర్ పిచాయ్ ఎంబీఏ చదివారు. 2004లో గూగుల్‌లో చేరిన ఆయన 2015లో సీఈవోగా నియమితులయ్యారు.
అరవింద్ కృష్ణ
ఐబీఎం ఛైర్మన్ మరియు సీఈవో అరవింద్ కృష్ణ. ఐఐటీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో PhD పూర్తి చేశారు. 1990లో ఐబీఎంలో చేరారు. 2015లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా అరవింద్ కృష్ణ పదోన్నతి పొందారు.
నికేశ్ అరోరా
నికేశ్ అరోరా.. 2018 నుంచి పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవోగా ఉన్నారు. ఐఐటీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) నుంచి గ్రాడ్యుయేషన్ మరియు బోస్టన్ కళాశాల నుంచి ఎమ్మెల్సీ పూర్తి చేశారు. ఈశాన్య విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశాడు. పాలో ఆల్టోలో చేరడానికి ముందు.. నికేశ్ అరోరా గూగుల్, సాఫ్ట్‌బ్యాంక్‌లో పనిచేశారు.
జార్జ్ కురియన్
2015 నుంచి డేటా స్టోరేజ్ కంపెనీ NetAppకు సీఈవో, ప్రెసిడెంట్ గా ఉన్నారు జార్జ్ కురియన్. ఆయన ఐఐటీ మద్రాస్‌లో అడ్మిషన్ కూడా వేశారు. అయితే ఆ తర్వాత ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో అదే కోర్సును అభ్యసించడానికి వెళ్లారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశారు.
రాజేష్ గోపీనాథ్
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు రాజేష్ గోపీనాథ్. 1994లో తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివారు. పట్టభద్రుడయ్యాడు. ఐఐఎం అహ్మదాబాద్ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ డిప్లోమో ఇన్ మెనేజ్ మెంట్ పూర్తి చేశారు.
ఇంద్రా నూయి
పెప్సికో మాజీ చైర్‌పర్సన్, సీఈవో ఇంద్రా నూయి 1974లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1976లో ఐఐఎం కలకత్తా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో ఆమె కూడా స్థానం సంపాదించారు. ప్రస్తుతం అమెజాన్ మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డులలో పనిచేస్తున్నారు.
ఐఐఎం, లేదా ఐఐటీల్లో విద్యార్థి కానీ ఇతర ప్రముఖ సంస్థల అగ్ర స్థానం సంపాదించిన వారూ ఉన్నారు. వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఫ్లెక్స్ సీఈఓ రేవతి అద్వైతి మరియు Vimeo CEO అంజలి సుద్ ఉన్నారు.
Also Read: Internship: ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలెక్కువ.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రముఖ కంపెనీల్లో చేసేయండి
Also Read: స్నేహితుడికి ఉద్యోగమెుచ్చింది.. నాకెందుకు రాలేదనే పోలిక కాదు.. ఎక్కడ వెనకపడ్డారో చూసుకోండి
Also Read: Resume: జాబ్ ట్రయల్స్ వేస్తున్నారా? రెజ్యూమ్ ఇలా సింపుల్ గా ఉంటే చాలు కదా బ్రో!