X

స్నేహితుడికి ఉద్యోగమెుచ్చింది.. నాకెందుకు రాలేదనే పోలిక కాదు.. ఎక్కడ వెనకపడ్డారో చూసుకోండి

రోజూ.. మన పక్కనే ఉన్న ఫ్రెండ్ కి ఉద్యోగం వస్తుంది.. కానీ మనకు రాదు.. అలాంటప్పుడు ఎంత ఆలోచిస్తామో కదా. 

FOLLOW US: 

చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్ తో పాటు మన చదువు అయిపోయాక.. జాబ్ ట్రయల్స్ వేస్తుంటాం. కానీ సడెన్ గా అరే.. మామ నాకు ఉద్యోగం వచ్చిందని.. ఆ ఫ్రెండ్ చెప్తాడు. ఆ టైమ్ కి పార్టీ అడిగి.. ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసినా.. పార్టీ అయిపోయాక.. ఒంటరిగా కూర్చోని ఎంతలా ఆలోచిస్తాం కదా. మీకు కూడా ఉద్యోగం వస్తుందనే నమ్మకంలో ఉంటారు. కానీ ఎక్కడ వెనకపడ్డారో ఆలోచించారా? ఇది చాలా మందిలో ఉండే సమస్యే. మన పక్కన ఉండే వాళ్లకి.. మనకి సమాన విద్యార్హత.. కానీ ఉద్యోగం చేసే టైమ్ వచ్చే వరకు పరిస్థితులు అన్నీ మారిపోతాయి.

మీ గురించి.. మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.  మీ బలం, బలహీనత, అలవాట్లు, మంచి, చెడు.. అన్నీ మీకే బాగా తెలిసి ఉంటాయి. ఒంటరిగా కూర్చొని వాటిని ఓ పేపర్ మీద రాసుకోండి.. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో ఆలోచించండి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించండి. అలా అని ఒక్కరోజులోనే ఇది సాధ్యం కాదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉదాహరణకు మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ లో సూపర్ గా మాట్లాడొచ్చు. కానీ మీకు తెలిసినా మాట్లాడాలంటే.. భయం కావొచ్చు. ప్రాక్టిస్ చేయండి.. నలుగురితో మాట్లాడేందుకు ప్రయత్నించండి.

ఇంజినీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తవ్వగానే హమ్మయ్యా.. ఇక చాలు.. చదివింది అనుకుంటారు. చదువు అయిపోయింది.. కానీ నేర్చుకోవడం మాత్రం అవ్వలేదు. ఎల్లప్పుడూ.. నేర్చుకుంటూ ఉంటేనే.. అప్ డేట్ అవుతూ ఉంటాం. దేని గురించైనా తెలిస్తే.. నేర్చుకునే ప్రయత్నం చేస్తే మంచిది.  నేర్చుకోవడం ఆపేస్తే అక్కడే ఆగిపోతాం. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తికి తలుపులు వేయకూడదు. తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోతే అది చాలా పెద్ద తప్పు. ఉన్న చోటే ఉండిపోతారు. సిగ్గుపడకుండా వెళ్లి.. మీ ఫ్రెండ్ ని ఉద్యోగానికి సంబంధించిన విషయాలు అడిగేసేయండి. చాలా విషయాలు తెలుస్తాయి. 

వాళ్లతో నేను ఎందుకు మాట్లాడాలి అనే మనస్తత్వం ఉంటే.. ఎప్పుడు అక్కడే ఉండిపోతారు. నలుగురిలో కలిసిపోండి. మీకంటే ఎక్కువ విషయాలు.. ఆ నలుగురికే.. తెలిసి ఉండొచ్చు. వాళ్లు ఉద్యోగులు అయిఉండొచ్చు.. ఎలా అయినా ఉపయోగపడతారు కదా.

మీ గురించి మీరు.. ఎక్కడెక్కడ వెనకపడ్డారో ఆలోచించండి. వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. ప్రస్తుతంలో లోపాలు అధిగమించేందుకు చేసే ప్రయత్నాలే.. భవిష్యత్ లో మన జీవితం.

Also Read: Resume: జాబ్ ట్రయల్స్ వేస్తున్నారా? రెజ్యూమ్ ఇలా సింపుల్ గా ఉంటే చాలు కదా బ్రో!

Also Read: NEET 2021 Counselling: త్వరలో నీట్ కౌన్సెలింగ్.. ఎన్‌టీఏ తాజా నోటిఫికేషన్.. అభ్యర్థులు చేయాల్సిన పనులివే

Also Read: ISRO Online Course: ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. 12 రోజుల్లో మీ చేతిలో సర్టిఫికేట్ .. ఏం నేర్పిస్తారంటే.. 

Tags: Depression Unemployment comparison skills job skills

సంబంధిత కథనాలు

Fact Check CBSE :  సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

Fact Check CBSE : సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

టాప్ స్టోరీస్

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా  చేయాలట….

Himaja: డబ్బులిచ్చి రాయిస్తున్నారు... ఆ వార్తలపై ఫైర్ అయిన హిమజ!

Himaja: డబ్బులిచ్చి రాయిస్తున్నారు... ఆ వార్తలపై ఫైర్ అయిన హిమజ!