ISRO Online Course: ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. 12 రోజుల్లో మీ చేతిలో సర్టిఫికేట్ .. ఏం నేర్పిస్తారంటే..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో) ఫ్రీ ఆన్ లైన్ కోర్సును ప్రకటించింది. 70 శాతం హాజరు ఉంటే ఇస్రో సర్టిఫికేట్ ఇస్తుంది.
'జియోఇన్ఫర్మేటిక్స్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్లానింగ్' ఆన్‌లైన్ కోర్సును ఇస్రో ప్రకటించింది. విద్యార్థులు, నిపుణులకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. పన్నెండు రోజులపాటు ఉండే ఈ కోర్సును డిసెంబర్ 6 నుంచి 17వరకు నిర్వహించనున్నట్టు ఇస్రో తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS)తో ఈ కోర్సును ఇస్రో తీసుకోస్తుంది. ఐఐఆర్ఎస్ అనేది సహజ వనరులు, పర్యావరణ, విపత్తు నిర్వహణ కోసం రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, జీఎన్ఎస్ఎస్ (GNSS) టెక్నాలజీలో శిక్షణ పొందిన నిపుణులను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక శిక్షణ, విద్యా సంస్థ.
'జియోఇన్ఫర్మేటిక్స్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్లానింగ్' కోర్సుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పర్యావరణ అధ్యయనాల్లో నిమగ్నమైన పరిశోధకులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్లాస్ పోర్టల్ తో 70 శాతం హాజరు ఉంటే సరిపోతుంది. ఇస్రో అందించే సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు. ఐఐఆర్ఎస్ యూట్యూబ్ ఛానెల్ తో కోర్సును నేర్చుకోవాలి. అంతేకాదు.. 24 గంటల తర్వాత అందుబాటులో ఉండే.. ఆఫ్‌లైన్ సెషన్ ద్వారా తమ హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
2021, డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఈ-క్లాస్ పోర్టల్, IIRS YouTube ఛానెల్‌లో ఇస్రో నిర్వహిస్తుంది. ఎవరైనా ఆసక్తిగా ఉంటే.. మరిన్ని వివరాల కోసం.. వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి.. https://www.iirs.gov.in/iirs/sites/default/files/pdf/2021/Course_Brochure_93course.pdf పూర్తి వివరాలు తెలుసుకోండి.
బయోడైవర్సిటీ ఎలిమెంట్లను పర్యవేక్షించేందుకు రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లను ఉపయోగిస్తారు. అయితే దానిని ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ గా ఎలా ఉపయోగిస్తారనేది చెప్పడమే.. ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం.
జీవవైవిధ్య పరిరక్షణ ప్రణాళికలో జీఐఎస్ అప్లికేషన్లతోపాటు మెషిన్ లెర్నింగ్ తో వృక్షసంపద స్కేల్ మ్యాపింగ్ గా ను కూడా చెప్తారు. 3డీ క్యారెక్టరైజేషన్ లో అటవీ జీవవైవిధ్యం చూపించడం, జియోఇన్ఫర్మేటిక్స్ ఉపయోగించి ఫంక్షనల్ బయోడైవర్సిటీ అంచనా వేయడం కూడా చెబుతారు.
Also Read: JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్ లో మార్పులు.. వివరాల కోసం ఇక్కడ చూడండి
Also Read: SSC CGL Tier 1 Results: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్