JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్ లో మార్పులు.. వివరాల కోసం ఇక్కడ చూడండి
జేఈఈ అడ్వాన్స్ డ్ 2023కి సంబంధించి సిలబస్ లో మార్పులు జరిగాయి. వాటిని అధికారిక వెబ్ సైట్ లో పెట్టారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE అడ్వాన్స్‌డ్) సిలబస్ లో మార్పులు జరిగాయి. 2023 నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో ప్రవేశానికి సవరించిన సిలబస్‌ను జేఈఈ ప్రవేశపెట్టింది. దానికి సంబంధించిన కొత్త సిలబస్ ను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 సవరించిన పాఠ్యాంశాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మూడు సబ్జెక్టుల్లో మార్పులు జరిగాయి. గణితం, రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రంలో సవరణలు చేసినట్టు అధికారిక ప్రకటన జారీ అయింది.
JEE అడ్వాన్స్‌డ్ 2023 సిలబస్‌లో మార్పులు
ఫిజిక్స్ విభాగంలో General Physics, Mechanics, Thermal Physics, Electromagnetic Wavesతో పాటు మరికొన్ని అంశాలను చేర్చారు.
కెమిస్ట్రీ విభాగంలో Gases and Liquids, Atomic Structure, Chemical Bonding, and Molecular Structure కవర్ అవుతాయి.
గణితంలో Sets, Relations, and Functions, Algebra లాంటివి సవరించిన సిలబస్ లో ఉన్నాయి.
ఈ సబ్జెక్టులు, సవరణలకు సంబంధించి.. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి. దాని కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. https://jeeadv.ac.in/
దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్ లో మెుదటి 2.5 లక్షల ర్యాంకుల్లో సీటు పొందిన అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్ డ్ కు అర్హులు.
JEE అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షను ఈ ఏడాది అక్టోబర్ 3న నిర్వహించారు. అక్టోబర్ 15న ఫలితాలు ప్రకటించారు. పరీక్షకు హాజరైన 1,41,699 మంది విద్యార్థుల్లో 41,862 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో ఢిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్ 360కి 348 స్కోర్‌తో ప్రథమ స్థానంలో నిలిచాడు.
Also Read: SSC CGL Tier 1 Results: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్'పై కేంద్రం పునరాలోచన!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్