ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్
ఒకప్పటి.. విద్యావిధానంలా ఇప్పటి పరిస్థితులు లేవు. అంతా మారిపోయింది. ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే.
కరోనా తర్వాత.. విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆన్ లైన్ లోనే కొత్త కోర్సులు. అక్కడే చదువుకోవడం.. నేర్చుకోవడం.., దానికి తగ్గట్టు.. చాలా సంస్థలు కొత్త కోర్సులు డిజైన్ చేస్తున్నాయి. విద్యార్థులే కాదు.. నిపుణులు సైతం.. ఆన్లైన్ కోర్సులతో నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. అయితే కొన్ని ఎంతగానో ఉపయోగపడే కోర్సులున్నాయి. అవేంటో చూద్దాం..
సర్టిఫికేట్లు ఉండటమే కాదు.. నైపుణ్యాలు ఈ కాలంలో ఎంతో అవసరం. నైపుణ్యాల కొరతతో విద్యార్థులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్వ్యూకి వెళితే.. సరైన నైపుణ్యం లేక.. వెనక్కు వచేస్తున్న వారిని చాలా మందినే చూసి ఉంటాం. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని లీడింగ్ టెక్నాలజీస్ లో కొత్త కోర్సులు వచ్చాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కాలేజీ విద్యార్థులకు, ఫ్రెషర్లకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగం. ఏయే రంగాల్లో ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉందో వెల్లడించింది కోర్స్‌ఎరా ఇంపాక్ట్ రిపోర్ట్ 2021 (Coursera Impact Report).
బిజినెస్ లో కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్, బిజినెస్ అనాలిసిస్, ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. టెక్నాలజీలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, అల్గారిథం, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు. డేటా సైన్స్ లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, మ్యాథమెటిక్స్, డేటా మేనేజ్మెంట్ లాంటి వాటిని నేర్చుకోవచ్చు.
ఇప్పటి వరకు మెుత్తం 92 మిలియన్ల మంది లెర్నర్స్ కోర్స్ ఎరా ఎడ్ టెక్ ప్లాట్ ఫారమ్ లో రిజిస్టరై ఉన్నారు. అయితే ఇందులో బిజినెస్ స్కిల్స్ లో 81 శాతం మంది ప్రయోజనం పొందినట్టు సర్వేలో తేలింది. 71 శాతం మంది టెక్నాలజీ లెర్నర్స్ ప్రయోజనం పొందాగా.. మరోవైపు, డేటా సైన్స్ విభాగంపై 64 శాతం మందికి అవగాహన పెరిగింది. ఈ కోర్సులు నేర్చుకోవడం అనేది.. కరోనా టైమ్ లో ఎక్కువగా పెరిగింది.
మహిళలు కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఎంట్రప్రెన్యూర్షిప్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బిజినెస్ సైకాలజీ, బిజినెస్ అనాలిసిస్, డేటా అనాలసిస్, మెషిన్ లెర్నింగ్, మార్కెటింగ్ లాంటివి ఎక్కువగా నేర్చుకుంటున్నట్టు తేలింది.
Also Read: National Employment Policy: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ
Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి