National Employment Policy: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ
నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీని అమలు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికోసం ప్రణాళికలు చేస్తోంది..
జాతీయ ఉపాధి విధాన రూపకల్పన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో కేంద్రం ఉంది. ఉత్పాదక, తగినంత ఉద్యోగ కల్పనను కల్పించడం ప్రధాన లక్ష్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు.. మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. దానిలో భాగంగానే.. జాతీయ ఉపాధి విధానం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసే.. కమిటీలో.. వివిధ రకాల పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, కార్మిక, ఇతర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఉంటారు. ఇండియాలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు.. ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి పవర్ కమిటీని ఏర్పాటు చేయవచ్చని.. అందులో కమిటీ అభిప్రాయాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఉపాధి కల్పించే రంగాలపై పెట్టుబడులు, విధానపరమైన అంశాలు, దేశీయంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కొత్త పరిశ్రమలను ఆకర్షించడం వంటి అంశాలను కమిటీ చూస్తుంది.
జాతీయ ఉపాధి విధానంలో భాగంగా.. ఉపాధి అవకాశాలను పరిశీలించేందుకు.. ఆల్ ఇండియా లేబర్ సర్వే.., ఈ శ్రమ్ పోర్టల్ నుంచి సమాచారం సేకరిస్తారు. ఈ డేటా బేస్ అసంఘటిత రంగానికి సంబంధించిన సమాచారం సేకరించడానికి ఉపయోగపడుతుంది. ఈ డేటా ఆధారంగా చిన్న ఉపాధి అవకాశాలను కలిగిన వారికి ఎంతో ఉపయోగ పడతుందని ప్రభుత్వం చెబుతుంది.
దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో NEPని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రైవేట్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, ఏప్రిల్ 2020లో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో 23.52 శాతంగా ఉంది. CMIE ప్రకారం, ఏప్రిల్-జూన్ 2020-21 త్రైమాసికంలో, దాదాపు 121 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. ఇది ఉపాధి డేటాను కంపైల్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి రికార్డు స్థాయిలో నెలవారీ అత్యధిక ఉద్యోగాలు కోల్పోవడం అనే విషయం వెల్లడైంది.
దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెగ్మెంట్లోకి పెట్టుబడులు తీసుకురావడం వంటి వాటికి కావాల్సిన వ్యూహాలను రూపొందిచడం ఎన్ఈపీ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా దేశంలో ఉన్న 50 కోట్లకుపైగా కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు
Also Read: Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!
Also Read: Birsa Munda Jayanti: 'స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడం ఇదే తొలిసారి'
Also Read: Gujarat Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. వీటి విలువ రూ. 600 కోట్ల పైమాటే!