Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది.
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు. అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. "ముందుగా జైలు కూడు తినండి. ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటాం" అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
అయితే, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఒక బెడ్ ఏర్పాటు చేయాలన్న అనిల్ దేశ్‌ముఖ్ అభ్యర్థనను మాత్రం కోర్టు మన్నించింది. ఆయనకు కేటాయించిన గదిలో బెడ్ ఏర్పాటుకు అనుమతించింది.
ఈనెల 2న అరెస్ట్
అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 2న అర్ధరాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్ముఖ్తో పాటు కుందన్ షిందే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది.
Also Read: Gujarat Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. వీటి విలువ రూ. 600 కోట్ల పైమాటే!
Also Read: Delhi Air Pollution: లాక్డౌన్ బాటలో దేశ రాజధాని.. కరోనా కోసం కాదు అంతకుమించి!
Also Read: Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు
Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి