Delhi Air Pollution: లాక్‌డౌన్ బాటలో దేశ రాజధాని.. కరోనా కోసం కాదు అంతకుమించి!
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దేశ రాజధానిలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దిల్లీ సర్కార్.. సుప్రీం కోర్టుకు తెలిపింది.

దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దేశ రాజధానిలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు తమ ప్రతిపాదనను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచింది.
దిల్లీతో పాటు నేషనల్ కేపిటల్ రీజైన్ (ఎన్‌సీఆర్)లో కూడా లాక్‌డౌన్ విధిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కేజ్రివాల్ సర్కార్ సుప్రీం కోర్టుకు తెలిపింది.
చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలు తగలబెట్టడమే వాయు కాలుష్యం ఎక్కువ అవ్వడానికి కారణమని కేజ్రీ సర్కార్ పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. పంట వ్యర్థల తగలబెట్టడం మాత్రమే కాలుష్యానికి కారణం కాదని సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఎందుకంటే మొత్తం కాలుష్యంలో పంట వ్యర్థాల ప్రభావం 10 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

